
ఈ ఏడాది సంచలన విజయం సాధించిన సయ్యారా సినిమా టైటిల్ సాంగ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిండి ఉంది. సినిమా హీరోయిన్ అనీత్ పడ్డా తన తండ్రితో కలిసి ఈ పాటను పాడింది. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
సయ్యారా సినిమా టైటిల్ సాంగ్‌ను అనీత్ పడ్డా తన తండ్రితో కలిసి పాడింది.
గిటార్ వాయిస్తూ పాడిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనీత్ పడ్డా అద్భుతమైన గాత్రంతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
సయ్యారా సినిమా విజయం తర్వాత అనీత్ పడ్డాకు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.
అనీత్ పడ్డా సింగింగ్ టాలెంట్
సయ్యారా మూవీ ఈ ఏడాది ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఓ చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇందులోని సయ్యారా టైటిల్ సాంగ్ అయితే కొన్ని నెలలుగా టాప్ ట్రెండింగ్ సాంగ్స్ లో కొనసాగుతోంది. ఇప్పుడా పాటను ఈ మూవీ హీరోయిన్ అనీత్ పడ్డా తన తండ్రితో కలిసి పాడింది. గిటార్ వాయించుకుంటూ ఆమె పాడిన ఈ పాట వైరల్ అవుతోంది.
అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన సయ్యారా సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. వీరిద్దరి అద్భుత నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కొన్ని వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా వసూళ్లు మందగించి ఉండొచ్చు కానీ నటీనటులకు ఫ్యాన్ క్రేజ్ మాత్రం పెరుగుతోంది.
వైరల్ అవుతున్న వీడియో
తాజాగా తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ అనీత్ పడ్డా తన సింగింగ్ వీడియోను షేర్ చేసింది. అనీత్ వాయిస్ విన్న అభిమానులు ఆమెను గొప్ప సింగర్ అని కొనియాడుతున్నారు. ఆదివారం (ఆగస్టు 24) రాత్రి అనీత్ తన అభిమానుల కోసం ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి చేతిలో గిటార్ పట్టుకుని సయ్యారా సినిమా టైటిల్ సాంగ్ పాడటం చూడొచ్చు. ఆ వీడియోలో ఆమె తండ్రి కూడా కూతురిని ప్రోత్సహిస్తూ హమ్మింగ్ చేస్తూ కనిపించారు. అనీత్ సింగింగ్ టాలెంట్, క్యూట్ వాయిస్ విని సోషల్ మీడియా యూజర్లు ముగ్ధులవుతున్నారు.
అనీత్ పాడిన ఈ పాట విన్న తర్వాత ఒక యూజర్ ఇలా రాశారు.. అందమైన ముఖం, వాయిస్ కూడా ఆమె నటనలాగే చాలా బాగుంది అని అన్నారు. ఇక మరొక యూజర్ స్పందిస్తూ.. ఒరిజినల్ కంటే బాగుంది. మీ గొంతులో భిన్నమైన నిజాయతీ ఉంది అని అనడం విశేషం. ఇంకో యూజర్ ఇలా రాశారు.. నేను మొదటిసారి అందమైన గొంతుతో ఒక బాలీవుడ్ నటిని చూస్తున్నాను అని అన్నారు.
సయ్యారా సినిమా విజయం
‘ఇది చాలా క్యూట్, సింపుల్’ అని మరో యూజర్ కామెంట్ చేయగా.. ఆ ముఖం, నటన తర్వాత వాయిస్ కూడా క్రేజీగా మారింది అని మరొకరు అన్నారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సయ్యారా మూవీలో టైటిల్ సాంగ్ ను ఇర్షాద్ కామిల్ రాయగా.. తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్షద్ నిజామి సంగీతం అందించారు. మేల్ వెర్షన్ కు ఫహీమ్ వాయిస్ ఇచ్చారు. ఇక ఫిమేల్ వెర్షన్ ను శ్రేయా ఘోషల్ పాడింది. ఇక వసూళ్ల విషయానికొస్తే కొత్త నటీనటులు నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.553 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ నటులను కొత్త ప్రాజెక్టుల్లో చూడాలని ఎదురు చూస్తున్నారు.
అనీత్ పడ్డా యొక్క గాత్రం ప్రతిభ అభిమానులను మెప్పించింది. ఈ వీడియో వైరల్‌గా మారడం ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని సినిమాల్లో కనిపిస్తుందని ఆశిద్దాం.


