
‘సీత ప్రయాణం కృష్ణతో’ మూవీ నవంబర్ 14న విడుదల కానుంది. రోజా భారతి, దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం సినిమా విశేషాలను వెల్లడించింది. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Key Points
'సీత ప్రయాణం కృష్ణతో' చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ కీలక పాత్రల్లో నటించారు.
ఖుషి టాకీస్ పై దేవేందర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది.
‘సీత ప్రయాణం కృష్ణతో’ రిలీజ్ డేట్ ఖరారు
రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీత ప్రయాణం కృష్ణతో’. ఖుషి టాకీస్ పై నిర్మించిన ఈ చిత్రానికి దేవేందర్ దర్శకత్వం వహిస్తుండగా.. నవంబర్ 14 న గ్రాండ్‌గా రిలీజ్ అవబోతుంది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలు పంచుకున్నారు. హీరోయిన్ డా.రోజా భారతి మాట్లాడుతూ.. ‘ముందుగా ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. నన్ను నమ్మి ఈ సినిమా నాది అని అనుకుని అందరూ పనిచేసారు కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం. అందరు నవంబర్ 14 న మా చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.
హీరోయిన్ రాఖి శర్మ మాట్లాడుతూ.. ‘నాకు ఈ మూవీలో చాన్స్ ఇచ్చిన రాజీవ్‌కి, రోజా భారతికి చాలా థాంక్స్. ఇందులో నేను రాధికా అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నా. నాకు ఈ రోల్ చాలా స్పెషల్. సీత ప్రయాణం కృష్ణతో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపింది. డైరెక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. ‘సీత ప్రయాణం కృష్ణతో సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. మా సినిమాని అన్ని తానై మోసిన రోజా భారతికి ఎప్పుడు రుణ పడి ఉంటాను. నవంబర్ 14 న రిలీజ్ అవుతున్న మా సినిమా ని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటునాను’ అని చెప్పుకొచ్చాడు.
నటీనటులు, దర్శకుని ఆశాభావం
ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
నవంబర్ 14న విడుదల కానున్న “సీత ప్రయాణం కృష్ణతో” చిత్రాన్ని అందరూ ఆదరించి, తమ ఆశీస్సులు అందించాలని చిత్ర బృందం కోరింది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేశారు.


