|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షாக்: ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్! శేఖర్ కమ్ముల సంచలన నిర్ణయం! హీరో ఎవరంటే..?

Published: 03-03-2026, 12:05 PM
షாக்: 'హ్యాపీ డేస్'కి సీక్వెల్! శేఖర్ కమ్ముల సంచలన నిర్ణయం! హీరో ఎవరంటే..?
  • శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సీక్వెల్ సంచలనం: యూత్ ఫుల్ ఎంటర్టైనర్‏గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం!
  • జెన్ Z కిడ్స్ కోసం సరికొత్త కథతో ‘హ్యాపీ డేస్ 2’: శేఖర్ కమ్ముల ప్లాన్!
  • రెండు కథలు సిద్ధం చేసిన శేఖర్ కమ్ముల: త్వరలోనే హీరో ఎవరనేది ప్రకటన!
  • బ్లాక్ బస్టర్ సీక్వెల్‏తో వస్తున్న శేఖర్ కమ్ముల: ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!

టాలీవుడ్‏లో సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‏లో హాట్ టాపిక్‏గా మారింది.

హ్యాపీ డేస్ సీక్వెల్: శేఖర్ కమ్ముల ప్లాన్స్!

Sekhar Kammula: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అంటే దర్శకుడు శేఖర్ కమ్ముల అనే చెప్పాలి. మొదటి సినిమా ఆనంద్ నుంచి మొన్నొచ్చిన కుబేర వరకు ఆయన తాలూకు ఆ సిసిబిలిటీస్ క్లియర్ గా కనిపిస్తాయి. అందుకే,. శేఖర్ కమ్ముల సినిమాలుక్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆయన తెరకెక్కించిన సినిమాల్లో హ్యాపీ డేస్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.

2007లో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ భారీ విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో నలుగురు స్నేహితుల కథతో వచ్చిన ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినా మిస్ అవకుండా చూసేవాళ్ళు ఉన్నారు అంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కుబేర తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) రెండు కథను సిద్ధం చేస్తున్నాడట.

జెన్ Z కిడ్స్ కోసం సరికొత్త కథ!

అందులో ఒకటి హ్యాపీ డేస్ 2 అని సమాచారం. జెన్ సి కిడ్స్ కి బాగా సెట్ అయ్యేలా ఈ కథను సిద్ధం చేస్తున్నాడట శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఈ కథ కూడా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ కథతో పాటు మరో రెగ్యులర్ కథను కూడా రెడీ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. ఈ రెండు కథల్లో ఏది ముందు ఒకే అయితే అదే కథతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట శేఖర్ కమ్ముల.

హీరో ఎవరనేది త్వరలోనే ప్రకటన!

అయితే, ఈ రెండు కథల ఫైనల్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరు హీరోగా చేస్తారు అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. మరి బ్లాక్ బస్టర్ హ్యాపీ డేస్ సీక్వెల్ ఇప్పటి జెన్ జీ కిడ్స్ కి ఏమాత్రం ఎక్కుతుందా అనేది చూడాలి.

శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సీక్వెల్‏తో వస్తున్నారంటేనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.