
టాలీవుడ్, బుల్లితెర నటుడు సాయి కిరణ్ 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న వార్త ప్రస్తుతం చర్చనీయాంశం. తన రెండో భార్య స్రవంతితో కలిసి ఈ శుభవార్తను ప్రకటించారు. ఆయన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Key Points
నటుడు సాయి కిరణ్ తన 47వ ఏట తండ్రి కాబోతున్నారు.
సాయి కిరణ్, ఆయన సతీమణి స్రవంతి ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
సాయి కిరణ్కు ఇది రెండో వివాహం; మొదటి వివాహం వైష్ణవితో జరిగింది.
ఆయన ప్రముఖ టాలీవుడ్ సింగర్ పి. సుశీల గారి మనవడు.
సాయి కిరణ్ కెరీర్ ప్రస్థానం: హీరోగా నుండి బుల్లితెర వరకు
టాలీవుడ్ లో హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు నటుడు సాయి కిరణ్. నువ్వే కావాలి, ప్రేమించు, మనసుంటే చాలు వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ.. హీరో గా తన కెరీర్ ని కొనసాగించలేకపోయారు. కానీ… కొంత గ్యాప్ తర్వాత… ఆయన బుల్లితెరపై రంగప్రవేశం చేశారు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు వంటి సినిమాలతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం అనే సీరియల్ లో తండ్రి పాత్ర చేస్తున్నారు.
A post shared by Actress Sravanthi (@sravanthi.official)
47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న సాయి కిరణ్
కాగా… ఈ 47ఏళ్ల హీరో… త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. 2010లో సాయి కిరణ్ కి వైష్ణవి అనే యువతితో వివాహం జరిగింది. కొంత కాలం తర్వాత…. మనస్పర్థలతో వారు విడిపోయారు. రీసెంట్ గానే తనతో కలిసి సీరియల్ లో పని చేసిన స్రవంతిని వివాహం చేసుకున్నారు. ఈ వయసులో రెండో పెళ్లా అని చాలా మంది చర్చించుకున్నారు. అయితే… త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
A post shared by Sai Kiran Ram (@saikiran_official_23)
సాయి కిరణ్ నేపథ్యం: గాయని పి. సుశీల మనవడు
ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిదో నెల అని….మరో నెల రోజుల్లో తమ జీవితంలోకి బిడ్డ రాబోతున్నట్లు ఈ జంట తెలియజేసింది. చాలా మందికి సాయి కిరణ్ ఒక సీరియల్ నటుడుగా మాత్రమే తెలుసు. కానీ… ఆయన ప్రముఖ టాలీవుడ్ సింగర్ పి.సుశీల గారి మనవడు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇక పోతే… త్వరలో పేరెంట్స్ కాబోతున్న సాయికిరణ్, స్రవంతి దంపతులకు మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం…
సాయి కిరణ్, స్రవంతి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతుండటం ఆనందకరమైన విషయం. ఈ కొత్త ప్రయాణం వారి జీవితాల్లో మరింత సంతోషాన్ని నింపాలని ఆశిస్తూ, వారికి మన శుభాకాంక్షలు తెలియజేద్దాం.


