|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకంటే వెనకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్, నా బ్యానర్ కూడా కొట్టేశాడు.. సీనియర్ హీరో కామెంట్స్ వైరల్

Published: 07-08-2025, 10:19 PM
నాకంటే వెనకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్, నా బ్యానర్ కూడా కొట్టేశాడు.. సీనియర్ హీరో కామెంట్స్ వైరల్

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. చిరంజీవి కెరీర్, రెమ్యునరేషన్ గురించి ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Key Points

1

మురళీమోహన్ గారు చిరంజీవితో తన అనుభవాలను పంచుకున్నారు.

2

చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన విషయంపై ఆయన స్పందించారు.

4

చిరంజీవి, మురళీమోహన్ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.

మురళీమోహన్ గారి ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ తన కెరీర్ ని నెమ్మదిగా ప్రారంభించారు. ఆరంభంలోనే చిరంజీవికి అదిరిపోయే క్యారెక్టర్లు దక్కలేదు. అవసరమైనప్పుడు నెగిటివ్ రోల్స్ కూడా చేశారు. గుర్తింపు వచ్చాక హీరోగా మెరుపు వేగంతో దూసుకుపోయారు. 80వ దశకంలో ఉన్న అగ్ర హీరోలని అధికమిస్తూ చిరంజీవి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. చిరంజీవివి ఇండస్ట్రీలో ఎదిగిన విధానాన్ని, ఆయన ట్యాలెంట్ ని పలువురు ప్రముఖులు అభినందిస్తుంటారు.

ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ చిరంజీవి కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఇతర నటీనటుల్ని చూసి అసూయ పడలేదని మురళి మోహన్ అన్నారు. నేను ఎక్కువగా విజయ బాపినీడు గారి బ్యానర్ లో సినిమాలు చేసేవాడిని. చిరంజీవి వచ్చాక విజయ బాపినీడు ఆయనతో ఎక్కువగా సినిమాలు చేయడం ప్రారంభించారు. పైగా నాకంటే వెనుకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు.

చిరంజీవి కెరీర్ పై అభిప్రాయాలు

అరె చిరంజీవి నా బ్యానర్ కొట్టేశాడే, నాకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడే అని నేనెప్పుడూ బాధపడలేదు. చిరంజీవి ట్యాలెంట్ కి ఆ విధంగా అవకాశాలు వచ్చాయి. నా ట్యాలెంట్ కి తగ్గ విధంగా నాకు ఛాన్సులు వచ్చాయి అని మురళీమోహన్ తెలిపారు. వాస్తవానికి బాపినీడు గారికి చిరంజీవిని పరిచయం చేసింది నేనే.

చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్నాను. కానీ ఆయనతో నాకు పరిచయం లేదు.. నువ్వు పరిచయం చేస్తావా అని బాపినీడు గారు నన్ను అడిగారు. దీనితో నేనే బాపినీడుగారిని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసినట్లు మురళీమోహన్ తెలిపారు. అప్పటి నుంచి చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. నేను ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించను అని మురళీమోహన్ అన్నారు.

విజయబాపినీడు గారితో చిరంజీవి సినిమాలు

చిరంజీవితో నాకు మంచి స్నేహం ఉంది. మనవూరి పాండవులు చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము సొంత అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళం. షూటింగ్ అయిపోయిన వెంటనే కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో నేను హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాను. దీనితో థియేటర్ కి వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్స్ కోసం ఆడియన్స్ ఎగబడేవారు. చిరంజీవి చూసి అన్నయ్య ఈ విధంగా నా కోసం కూడా ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు. దీనికి పది రెట్లు వస్తారు అని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది అని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి మరియు మురళీమోహన్ మధ్య ఉన్న స్నేహం, గౌరవం ఈ కామెంట్స్ ద్వారా స్పష్టమవుతున్నాయి. సినిమా పరిశ్రమలో సహకారం, పోటీ, సాధించిన విజయాల గురించి ఈ వార్త చర్చకు దారితీస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.