|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

“సీనియర్లు సీనియర్లే!” – చిరుపై ప్రభాస్ కామెంట్స్: రాజాసాబ్ ఈవెంట్‌లో సంచలనం!

Published: 27-12-2025, 12:43 PM
"సీనియర్లు సీనియర్లే!" – చిరుపై ప్రభాస్ కామెంట్స్: రాజాసాబ్ ఈవెంట్‌లో సంచలనం!
  • ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
  • మెగాస్టార్ చిరంజీవిపై ప్రభాస్ పరోక్షంగా ‘సీనియర్ల తర్వాతే మేము’ అంటూ గౌరవం చూపారు.
  • నిర్మాత విశ్వప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ప్రభాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
  • దర్శకుడు మారుతి అద్భుతమైన సినిమా ఇచ్చారని, హీరోయిన్ల పనితీరును ప్రభాస్ ప్రశంసించారు.

‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “సీనియర్లు సీనియర్లే, వాళ్ల తర్వాతే మేము” అంటూ ప్రభాస్ తన వినయాన్ని ప్రదర్శిస్తూ, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ వేడుకలో హైలైట్స్ తెలుసుకోండి.

రాజాసాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన ‘ది రాజాసాబ్’(The RajaSaab Movie) మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. నగరంలో ఖైతలాపూర్‌ గ్రౌండ్స్‌ వేదిక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ‘ది రాజాసాబ్ సినిమాకు పనిచేసిన అందరికీ చాలా థాంక్స్. చాలా కష్టపడి చేశాం. రెండునరేళ్లు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. మాకు భయం లేని నిర్మాత దొరికారు. నిర్మాత విశ్వప్రసాద్‌ ఈ సినిమాకు నిజమైన హీరో. ఆయనకు సహనం చాలా ఎక్కువ. ఇలాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం. ఈ సినిమాకు తమన్ కూడా ప్రాణం పెట్టాడు. తమన్ అయితేనే న్యాయం చేస్తాడనిపించింది. ఇండియాలో తమన్‌‌లా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవరూ ఇవ్వలేరు.

ఈ సినిమాకు కూడా తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ముగ్గురు హీరోయిన్లు ఇరగ్గొట్టేశారు. నిధి, మాళవిక, రిధి ముగ్గురూ చాలా ఎనర్జిటిక్‌గా పనిచేశారు. ఇన్నిరోజులు మాస్ సినిమాలతో విసిగిపోయిన మా అభిమాలకు మారుతీ అద్భుతమైన సినిమా ఇవ్వబోతున్నారు. మారుతీ రైటింగ్‌కు ఫ్యాన్ అయిపోయా. క్లైమాక్స్ రావడం చూసి షాకయ్యా. పెన్‌తో రాశాడా.. మిషన్‌తో రాశాడా అని ఆశ్చర్యంగా ఉండేది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఎంటర్‌టైన్ మెంట్ జోనర్ చేస్తున్నా.. అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. మా సినిమాతో పాటు సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నీ హిట్ అవ్వాలి. ముఖ్యంగా సీనియర్ల(చిరంజీవి) సినిమాలు రాబోతున్నాయి. వారి సినిమాలు చాలా పెద్ద హిట్ అవ్వాలి. మనం ఏది అయినా.. ఎంతదూరం వెళ్లినా సీనియర్.. సీనియరే.. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నాము. వాళ్ల తర్వాతే మేము. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్ అవ్వాలి’ అని ప్రభాస్ అన్నారు.

చిరుపై ప్రభాస్ వినయం: ‘సీనియర్ల తర్వాతే మేము’

ది రాజాసాబ్ సినిమా టీంపై ప్రభాస్ ప్రశంసలు

మొత్తంగా, ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రభాస్ వినయం, టీం వర్క్‌కు నిదర్శనంగా నిలిచింది. చిరంజీవి పట్ల ఆయన చూపిన గౌరవం, సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఈ సంక్రాంతికి రాజాసాబ్ విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.