|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకేసారి 9 ఓటీటీల్లో ‘4 గర్ల్స్’: ఈ సంచలన తెలుగు రివేంజ్ థ్రిల్లర్ 5 భాషల్లో ఎక్కడ చూడాలంటే?

Published: 31-12-2025, 1:00 PM
ఒకేసారి 9 ఓటీటీల్లో '4 గర్ల్స్': ఈ సంచలన తెలుగు రివేంజ్ థ్రిల్లర్ 5 భాషల్లో ఎక్కడ చూడాలంటే?
  • ‘4 గర్ల్స్’ తెలుగు క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ నేరుగా 9 ఓటీటీల్లో రిలీజ్ అయింది.
  • ఈ సినిమా మొత్తం 5 వేర్వేరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • సమాజంలో ఒంటరి మహిళలపై జరిగిన సంఘటనల ఆధారంగా కథ రూపొందించబడింది.
  • శృతిక, ఆకాంక్ష వర్మ, దితిప్రియ రాయ్, సెజల్ మాండవియ కీలక పాత్రలు పోషించారు.

ఓటీటీ ప్రియులకు శుభవార్త! తెలుగులో తెరకెక్కిన సంచలన క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ ‘4 గర్ల్స్’ నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఏకంగా 9కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో, 5 భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఆసక్తికర సినిమా గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

9 ఓటీటీల్లో ‘4 గర్ల్స్’: ఎక్కడ స్ట్రీమింగ్?

ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సినిమా 4 గర్ల్స్. తెలుగులో రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 4 గర్ల్స్ ఏకంగా 9కిపైగా ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, ఐదు భాషల్లో 4 గర్ల్స్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి 4 గర్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగులో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో చాలా వరకు థియేటర్లలలో రిలీజ్ అయి ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండానే ఓటీటీలలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి

కథాంశం ఏంటి? దర్శకుడు ఎవరు?

సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు, అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరుగుతున్నాయి . అలా రీసెంట్‌గా జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్‌ని బేస్ చేసుకుని ఈ 4 గర్ల్స్ సినిమాను తెరకెక్కించారు దర్శకనిర్మాతలు.

న్యాయం దొరకనప్పుడు సమాజానికి ఎదురెళ్లి తప్పుడు దారిలోనైనా నేరస్థులను పట్టుకుని తమ చేతులతో శిక్షించి న్యాయానికి ఊపిరిపోయ్యచ్చనే అంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో 4 గర్ల్స్ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే, ఏకంగా 9 ఓటీటీ ల్లోకి నేరుగా 4 గర్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా.. నటీనటులు

ఈ సందర్భంగా యూ నరసింహులు, ఎస్ రమేష్ మాట్లాడుతూ.. “మా సినిమాకు అన్ని ప్రముఖ ఓటీటీలలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఒరియెంటెడ్ క్రైమ్, రివేంజ్, థ్రిల్లర్ జోనర్‌లో చేసినందుకు ఆనందంగా ఉంది” అని తెలిపారు.

ఇదిలా ఉంటే, ఎస్ శివ దర్శకత్వం వహించిన 4 గర్ల్స్ సినిమాలో శృతిక గాఒక్కర్, ఆకాంక్ష వర్మ, దితిప్రియ రాయ్, సెజల్ మాండవియ, అంకుర్, ప్రిన్స్, హన్సి శ్రినివాస్తవ కీలక పాత్రలు పోషించారు.

సమాజానికి ఒక బలమైన సందేశాన్నిస్తూ, థ్రిల్లింగ్ అనుభూతిని పంచే ‘4 గర్ల్స్’ సినిమా నేరుగా ఓటీటీల్లోకి రావడంతో ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది. ఈ రివేంజ్ డ్రామా ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.