|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెప్టెంబర్ 13: షష్ఠి+కృత్తిక నక్షత్రం – సుబ్రమణ్య స్వామి అనుగ్రహం కోసం

Published: 11-09-2025, 12:17 AM
సెప్టెంబర్ 13: షష్ఠి+కృత్తిక నక్షత్రం - సుబ్రమణ్య స్వామి అనుగ్రహం కోసం

సెప్టెంబర్ 13న షష్ఠి, కృత్తిక నక్షత్రం యోగం ఏర్పడుతుంది. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా సంతాన, ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చునని నమ్ముతారు.

Key Points

1

సెప్టెంబర్ 13న షష్ఠి, కృత్తిక నక్షత్రం యోగం.

2

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు, అష్టకం పారాయణం.

4

సంతాన భాగ్యం, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి.

కృత్తిక నక్షత్రం విశేషాలు

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని పిల్లాపాపలతో ఇల్లు కళకళ్లాడాలని భావిస్తారు. కానీ కొంత మంది సంతానం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే విధంగా కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పులతో సతమతమవుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చేసిన అప్పులు తీరవు. అయితే సంతానం కలగాలన్నా, అప్పులు బాధల నుంచి బయటపడాలన్న సెప్టెంబర్ 13 చాలా ముఖ్యమైనది. సెప్టెంబర్ 13 చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. సెప్టెంబర్ 13న షష్టి పైగా కృత్తిక నక్షత్రం వస్తుంది.

కృత్తిక నక్షత్రం విశిష్టత

కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం. సంతానాన్ని ప్రసాదించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం. అదే రోజు షష్టి రావడం మరింత విశేషం. కృత్తికా నక్షత్రానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడం వల్ల, ఈ రోజున సంతానాన్ని ప్రసాదించడానికి ఆయన పూర్తి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని పరిహారాలను పాటించడం మంచిది.

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన

సెప్టెంబర్ 13న ఏం చేస్తే మంచిది?

ఆ రోజు షష్టి , కృత్తిక నక్షత్రం కలిసిన విశేషమైన రోజు. ఈ రోజున సంతాన భాగ్యం కలగాలంటే షణ్ముఖ స్తోత్రాన్ని 9 సార్లు చదవండి. అదే విధంగా సుబ్రహ్మణ్యం అష్టకం కూడా తొమ్మిది సార్లు చదవండి. మీకు సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లండి. రెండు తలల నాగరాజుకి పాలతో అభిషేకం చేయడం వలన మంచి ఫలితం చూస్తారు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పులను కూడా తొలగిస్తాడు. కాబట్టి ఆయనను ఈ విధంగా ఆరాధించండి. ఈ స్తోత్రాలను చదవడం వల్ల లాభాలు ఉంటాయి. ఈ స్తోత్రాలను, అష్టకాలను చదవడం వలన మంచి ఫలితం చూస్తారు.

పరిహార మార్గాలు

ఆదాయం పెరుగుతుంది. సంతోషం ఉంటుంది. పిల్లాపాపలతో ఆనందంగా ఉండచ్చు. సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. ఈ విధంగా సెప్టెంబర్ 13న పాటించే పరిహారాలు మన జీవితానికి శ్రేయస్సును అందించి, సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా సంతాన, ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఈ సూచనలు పరిశీలించి, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.