|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రెండేళ్ల సహజీవనం, నిశ్చితార్థం.. బ్రేకప్ చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భ‌ట్!

Published: 28-01-2026, 11:05 AM
షాకింగ్: రెండేళ్ల సహజీవనం, నిశ్చితార్థం.. బ్రేకప్ చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భ‌ట్!
  • కీర్తి భ‌ట్, ప్రియుడితో రెండేళ్ల స‌హ‌జీవనం త‌ర్వాత బ్రేక‌ప్, అభిమానుల షాక్!
  • బిగ్ బాస్ సీజ‌న్ 6 ద్వారా పాపులర్ అయిన కీర్తి, బ్రేకప్ ప్రకటనతో కలకలం!
  • 2023లో నిశ్చితార్థం జరగగా, త్వరలో వివాహం ఉంటుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ!
  • కీర్తి భ‌ట్ సోషల్ మీడియాలో బ్రేక‌ప్ ప్రకటన, ధైర్యంగా ఉండాలని అభిమానుల సలహాలు!

బుల్లితెర ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్! బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భ‌ట్ తన ప్రియుడితో బ్రేకప్ చెప్పేసింది. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఇలా జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

కీర్తి భ‌ట్ బ్రేక‌ప్ వెనుక అసలు కారణాలేంటి?

రెండేళ్ల స‌హ‌జీవ‌నం, నిశ్చితార్థం త‌ర‌వాత బిగ్ బాస్ బ్యూటీ, సీరియ‌ల్ హీరోయిన్ కీర్తి భ‌ట్ త‌న ప్రియుడితో బ్రేక‌ప్ అయిన‌ట్టు ప్ర‌క‌టించింది. తెలుగు సీరియ‌ల్స్ లో న‌టించిన కీర్తి బిగ్ బాస్ సీజ‌న్ 6 ద్వారా ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. బిగ్ బాస్ షోలో ఉన్న స‌మ‌యంలోనే కీర్తి త‌న ప్రియుడిని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది. నిశ్చితార్థం త‌ర‌వాత‌వ వీరిద్ద‌రూ అనేక టీవీ షోల‌లో క‌లిసి సంద‌డి చేశారు. 2023లో వీరి నిశ్చితార్థం జ‌ర‌గ్గా త్వ‌ర‌లో వివాహం జ‌ర‌గ‌నుంద‌ని అభిమానులు అనుకున్నారు.

కానీ తాజాగా బ్రేక‌ప్ ప్ర‌క‌టించ‌డంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ మేర‌కు కీర్తి త‌న సోష‌ల్ మీడియాలో పోస్టులో.. నేను నిజాయితీగా మ‌రియు క్లియ‌ర్ గా ఉండాల‌ని అన‌నుకుంటున్నా. నా జీవితంలోని తాజా రిలేష‌న్ షిప్ కు తెర‌ప‌డింది. ఈ బంధం చాలా రోజుల నుండి కొన‌సాగింది. అది నిజ‌మైనది కూడా. కానీ ఈ బంధం ఎప్పుడూ జీవిత భాగ‌స్వామి లేదా భ‌ర్త‌గా మారిన‌ట్టు అనిపించ‌లేదు. ఇక‌పై ఇద్దరి అంగీకారంతో ఈ బంధం స్నేహంగా మాత్రేమే కొన‌సాగుతుంది. నా నిర్ణ‌యం వ‌ల్ల ఎవ‌రైనా బాధ‌ప‌డి ఉంటే క్ష‌మించండి. అంటూ కీర్తి భ‌ట్ పేర్కొంది. దీంతో అభిమానులు ఆమెను ధైర్యంగా ఉండాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

బిగ్ బాస్ బ్యూటీ సంచలన నిర్ణయం!

అభిమానుల షాక్.. కీర్తి రిలేషన్ షిప్ లో ఊహించని ట్విస్ట్!

కీర్తి భ‌ట్ బ్రేక‌ప్ ప్ర‌క‌ట‌న టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు మీ ముందుకు తీసుకువస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.