|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షారుఖ్ ఖాన్ ‘కింగ్’లో మరో బిగ్ స్టార్.. ఇక థియేటర్లు బద్దలవ్వాల్సిందే..

Published: 12-05-2025, 8:33 PM
షారుఖ్ ఖాన్ ‘కింగ్’లో మరో బిగ్ స్టార్.. ఇక థియేటర్లు బద్దలవ్వాల్సిందే..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించే ‘కింగ్’ సినిమాలో మరో స్టార్ హీరో జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నారు.

Key Points

1

షారుఖ్ ఖాన్ నటించే ‘కింగ్’ సినిమా 2026లో విడుదల కానుంది.

2

అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు.

4

మల్టీ స్టారర్‌తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నెటిజన్ల అంచనాలు.

‘కింగ్’ సినిమా విడుదల తేదీ

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే షారుఖ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘కింగ్’ (King) ఒకటి. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ (Director Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్నాడు. ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత మరోసారి షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో ‘కింగ్’ చిత్రం రాబోతుండటంతో.. ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికుల్లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

ఇదిలా ఉంటే.. ఇందులో విలన్‌గా అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) నటించనున్నట్లు ఇప్పటికే పలు వార్తలు బాలీవుడ్ నుంచి వైరల్ అవుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ హీరో పేరు వినిపిస్తుంది. నటుడు, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కపూర్ (Anil Kapoor) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటింనున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. రీసెంట్‌గా ఈయన షూటింగ్ సెట్‌లోకి కూడా అడుగుపెట్టినట్లు బాలీవుడ్ సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, మల్టీ స్టారర్‌తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

అనిల్ కపూర్ సినిమాలో?

అభిషేక్ బచ్చన్ విలన్‌గా

చివరగా, షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ ల కాంబినేషన్ తో ‘కింగ్’ సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 2026 లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.