
ప్రతిష్టాత్మకమైన మెట్ గాలా 2025 వేడుకలో షారుక్ ఖాన్ తొలి భారతీయ నటుడిగా పాల్గొని చరిత్ర సృష్టించారు. అయితే ఈ వేడుకకు ముందు షారుక్ చాలా భయపడ్డారని, పారిపోవాలనిపించిందని వెల్లడించారు.
Key Points
షారుక్ ఖాన్ మెట్ గాలాలో తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు.
సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనిపించారు.
వేడుకకు హాజరు కావడానికి ముందు చాలా భయపడ్డారని షారుక్ తెలిపారు.
ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, దిల్జీత్ సింగ్ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
మెట్ గాలాలో షారుక్ ఖాన్ సెన్సేషన్
సెలబ్రిటీల ఫ్యాషన్ షో ‘మెట్ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ వేదికగా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్ గాలా’ డ్రెస్‌కోడ్ ‘టైలర్డ్ ఫర్ యు’ కాగా, ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్‌స్టైల్’ను థీమ్‌గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్‌కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు.
భయం, బిడియం: షారుక్ అనుభవం
ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు షారుక్ ఖాన్. ‘‘ఈ ఏడాది మెట్ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్ కార్పెట్‌పై నడవలేదు. నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్.
ఇతర ప్రముఖుల హాజరు
ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్ జోనస్, హీరోయిన్ కియారా అద్వానీ, సింగర్–నటుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్’తో మెరిశారు.
షారుక్ ఖాన్ మెట్ గాలాలో భారతీయ సినిమాకు ప్రతినిధిగా నిలిచారు. తన భయాన్ని, అనుభవాన్ని పంచుకోవడం అభిమానులను మరింత ఆకర్షించింది. ఈ వేడుక చరిత్రలో నిలిచిపోతుంది.


