
📌 Key Points
- షకీలా, వేణు మాధవ్ మధ్య స్నేహం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన షకీలా.
- అవుట్ డోర్ షూటింగ్ లో వేణు మాధవ్ రూమ్ లో పడుకున్న షకీలా.. అసలు కారణం ఇదే!
- వేణు మాధవ్ అడిగిన ఒక ప్రశ్నతో షాక్ అయిన షకీలా.. ఆ తర్వాత నవ్వు ఆగలేదట!
- బ్రహ్మానందం, రఘుబాబుతో ఈ విషయాన్ని పంచుకుని తెగ నవ్వుకున్న షకీలా.. వైరల్ న్యూస్!
షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా వేణు మాధవ్ తో జరిగిన ఒక సంఘటన గురించి షకీలా స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వేణు మాధవ్ రూమ్‌లో షకీలా.. అసలేం జరిగింది?
బోల్డ్ రోల్స్ తో షకీలా సౌత్ సినీ రంగంలో గుర్తింపు పొందారు. శృంగారభరితమైన పాత్రలు చేశారు. తెలుగులో ఆమె అనేక చిత్రాల్లో నటించారు. జయం, నిజం, బంగారం, తొట్టి గ్యాంగ్, దొంగోడు లాంటి చిత్రాల్లో షకీలా కామెడీ రోల్స్ చేశారు. ఈ క్రమంలో ఆమెకి తెలుగు కమెడియన్స్ బ్రహ్మానందం, వేణు మాధవ్, అలీ లతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఓ ఇంటర్వ్యూలో షకీలా తనకు వేణు మాధవ్ తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడింది. తెలుగులో నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో వేణు మాధవ్ ఒకరు. అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఊహించని సంఘటన ఎదురైంది. దాని గురించి తప్పకుండా చెప్పాలి.
ఆ సినిమా గుర్తుకు రావడం లేదు కానీ.. నేను, వేణు మాధవ్, బ్రహ్మానందం, రఘుబాబు అందరూ ఉన్నారు. అందరికీ హోటల్ రూమ్స్ ఇచ్చారు. అందరూ వచ్చి నా రూమ్ లోనే తిన్నారు. దీనితో రూమ్ డర్టీగా మారింది. పడుకోవడానికి వీలు కాలేదు. దీనితో నీ రూమ్ కి వచ్చి పడుకుంటా అని వేణు మాధవ్ ని అడిగా. అలాగే రా పడుకో అని చెప్పాడు.
షూటింగ్ సమయంలో ఊహించని సంఘటన!
వెళ్లి నేను బెడ్ కి ఒక వైపు పడుకున్నా. రూమ్ లో టీవీ లైట్ తప్ప అంతా చీకటిగా ఉంది. మసక మసకగా కనిపిస్తోంది. ఆ టైంలో వేణు నాతో.. ఒక మాట అడుగుతాను.. నువ్వు కాదనకూడదు అని అడిగాడు. దీనితో నాకు డౌట్ వచ్చింది. ఏమైనా చెడుగా ప్రవర్తిస్తాడా ? బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడా ? అని అనుమానం వచ్చింది.
నేను వేణుని మంచి స్నేహితుడు అనుకున్నా కదా. ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకున్నా. ఏమైనా బ్యాడ్ గా అడిగితే ఇక్కడితో ఫ్రెండ్ షిప్ కట్ అని భావించా. సరే అడిగి చావు అని చెప్పా. దీనితో మళ్ళీ వేణు మాట్లాడుతూ.. ఒప్పుకోను అని మాత్రం చెప్పకూడదు అంటూ హస్కీ వాయిస్ తో చెబుతున్నాడు. దీనితో నా అనుమానం ఇంకా ఎక్కువైంది.
బ్రహ్మానందం, రఘుబాబుతో షకీలా పంచుకున్న సీక్రెట్స్!
అసలు ఏంట్రా నీ బాధ అని అడిగా. వేణు మాధవ్ సమాధానం ఇస్తూ.. నాకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. అవును నిజమే.. వాళ్ళు బావుండాలి అంటే నేను బతికి ఉండాలి.. సరే అయితే ఏంటి ఇప్పుడు అని అడిగా. దీనితో వేణు ఇద్దరి మధ్యలో పిల్లోలు పెడుతూ.. నిద్రలో నువ్వు నాపై పొరపాటున కాలు వేస్తే నేను చస్తా. అందుకే ఈ దిండ్లు పెడుతున్నా. వీటిపై నీ కాలు వేసుకో అని చెప్పాడు. నాకు రాత్రంతా నవ్వు ఆగలేదు. ఉదయాన్నే ఈ విషయాన్ని బ్రహ్మానందం, రఘుబాబుకి చెప్పు రోజంతా నవ్వుతూనే ఉన్నాను అని షకీలా పేర్కొంది.
షకీలా, వేణు మాధవ్ ల మధ్య జరిగిన ఈ సంఘటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


