|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sharmin Segal: బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి నటి షర్మిన్ సెగల్..!

Published: 01-06-2025, 8:11 AM
Sharmin Segal: బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి నటి షర్మిన్ సెగల్..!

ప్రముఖ వెబ్ సిరీస్ ‘హీరామండి’ నటి షర్మిన్ సెగల్ తల్లి అయ్యారు. తాజాగా ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ నటికి అభిమానుల నుండి శుభాకాంక్షలు వస్తున్నాయి.

Key Points

1

హీరామండి నటి షర్మిన్ సెగల్ తల్లి అయ్యారు.

2

మే 28న ఆమె బిడ్డకు జన్మనిచ్చారు.

4

షర్మిన్ సెగల్ బాలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందారు.

షర్మిన్ సెగల్‌కు బిడ్డ

హీరామండి వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలైన షెర్మిన్‌ హీరామండిలో కీలక పాత్రలో మెప్పించింది. అంతకుముందు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు  మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నటనలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ ‘మలాల్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. హీరామండి వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించలేదు. షెర్మిన్‌కు బాబు పుట్టాడని జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. మే 28న ఆమె తల్లిగా ప్రమోషన్ పొందారని వెల్లడంచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. షెర్మిన్‌ 2023 నవంబర్‌లో అమన్ మెహతాను పెళ్లాడారు. వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత అహ్మదాబాద్‌లో ఉంటున్న షర్మిన్‌ సెగల్ ఇటీవలే ముంబయికి షిఫ్ట్‌ అయింది.

హీరామండి నటి జీవితం

ఇక సినిమా విషయానికొస్తే షర్మిన్ చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్‌ హీరామండి: ది డైమండ్ బజార్‌లో కనిపించింది. ఈ సిరీస్‌లో అలం జేబ్ పాత్రను అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె ఆమె నటనకు తీవ్రంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరామండిలో షర్మిన్ తన గ్లామర్‌తో గుర్తింపు దక్కించుకుంది.

సినిమా ప్రస్థానం

కాగా.. సినీ ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు.  తల్లి బేలా సెగల్  పాపులర్‌ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్‌ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్  లాంటి ఎన్నో  చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.

షర్మిన్ సెగల్ వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తున్నారు. ఆమెకు మరియు ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.