|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సినిమా కోసం శర్వానంద్ ఏం చేశాడో చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 05-04-2026, 5:05 AM
షాకింగ్: సినిమా కోసం శర్వానంద్ ఏం చేశాడో చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • శర్వానంద్ ‘బైకర్’ మూవీ థియేటర్లలో గ్రాండ్ సక్సెస్!
  • శ్రీరాములు థియేటర్లో శర్వానంద్ సాష్టాంగ నమస్కారం, వీడియో వైరల్
  • సినిమా అంటే శర్వానంద్ కు పిచ్చి అని ఫ్యాన్స్ కామెంట్స్
  • ఏప్రిల్ 3న విడుదలైన ‘బైకర్’ మూవీకి సూపర్ హిట్ టాక్!

టాలీవుడ్ హీరో శర్వానంద్ సినిమాపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదవండి!

థియేటర్లో శర్వానంద్ సంచలనం!

సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో దగ్గర నుండి చిన్న టెక్నీషియన్ వరకు అందరూ కూడా దాదాపుగా సినిమా పట్ల తమ అభిమానాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమాపై తమకున్న పిచ్చిని అప్పుడప్పుడు నిరూపించుకుంటూ ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో శర్వానంద్ ఒకరు. ఈయనకు సినిమా అన్నా, సినిమా పరిశ్రమ అన్నా ఎంతో ఇష్టం. దీనిని పలు సందర్భాలలో ఆయన బయటపెట్టారు. ఇక మరోసారి సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చి అనేది రుజువైంది.

తాజాగా శర్వానంద్ నటించిన బైకర్ చిత్రం ఏప్రిల్ 3న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. దాంతో శర్వానంద్ చాలా థియేటర్లను సందర్శిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు శ్రీరాములు థియేటర్ కి వచ్చాడు. థియేటర్ స్క్రీన్ వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత స్క్రీన్ ను ముట్టి దానిని మొక్కాడు. ఇక ప్రస్తుతం శర్వానంద్ కి సంబంధించిన ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. స్క్రీన్ ముందు సాష్టాంగ నమస్కారం చేయడం, ఆ తర్వాత దాన్ని మొక్కడంతో సినిమా అంటే ఈయనకు ఇష్టం కాదు, పిచ్చి అనిపలువురు నెటిజన్లు ఈయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘బైకర్’ మూవీకి సూపర్ రెస్పాన్స్

వైరల్ అవుతున్న శర్వానంద్ వీడియో

శర్వానంద్ సినిమా పట్ల చూపించిన అభిమానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘బైకర్’ మూవీ విజయంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.