|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రెమ్యునరేషన్ వదులుకున్న శర్వానంద్! కారణం తెలిస్తే షాక్ అవుతారు!

Published: 22-01-2026, 10:05 PM
షాకింగ్: రెమ్యునరేషన్ వదులుకున్న శర్వానంద్! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
  • సంక్రాంతి బ్లాక్ బస్టర్: ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది!
  • బాలకృష్ణ ఆశీస్సులు: శర్వానంద్ ప్రతి సినిమాకు బాలయ్య ముహూర్తం!
  • అనిల్ సుంకర కోసం: పారితోషికం వదులుకున్న శర్వానంద్ సంచలన నిర్ణయం!
  • శ్రీవిష్ణుతో మల్టీస్టారర్: త్వరలో సుంకర బ్యానర్‌లో సందడి చేయనున్న శర్వా!

టాలీవుడ్ లో సంచలనం! శర్వానంద్ రెమ్యునరేషన్ విషయంలో ఒక భారీ నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఎందుకు తీసుకున్నాడు? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చూడండి!

బ్లాక్ బస్టర్ సక్సెస్: ‘నారి నారి నడుమ మురారి’

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)ఏడాది తర్వాత ‘నారి ‘నారి నడుమ మురారి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

బాలయ్య ఆశీస్సులు: ప్రతి సినిమాకు ముహూర్తం!

ఈ వేడుకలో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయడమే కాకుండా, ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నిన్ననే బాలయ్య బాబుతో మాట్లాడాను, ‘నా పరువు నిలబెట్టావు’ అని ఆయన మెచ్చుకున్నారు. ఇకపై నా ప్రతి సినిమాకు ఆయనే ముహూర్తం పెట్టాలని కోరుకుంటున్నాను’’ అని శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు. సీనియర్ హీరోల ఆశీస్సులు తన విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ కోసం: పారితోషికం వదులుకున్న హీరో!

మరోవైపు, నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara)పై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ శర్వానంద్ సంచలన ప్రకటన చేశారు. అనిల్ సుంకర మళ్లీ వరుసగా పెద్ద సినిమాలు చేసే వరకు, తన తదుపరి చిత్రానికి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోనని శర్వా ప్రామిస్ చేశారు. ఒక హీరో ప్రోడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుందో మేము చూపిస్తామని అన్నాడు. అలాగే, ఈ సినిమాలో చిన్న కామియో రోల్ చేసిన హీరో శ్రీవిష్ణు గొప్ప మనసును కొనియాడారు. భవిష్యత్తులో అనిల్ సుంకర బ్యానర్‌లో శ్రీవిష్ణుతో కలిసి పూర్తిస్థాయి మల్టీస్టారర్ సినిమా చేస్తానని, ఇద్దరం కలిసి వెండితెరపై సందడి చేస్తామని శర్వానంద్ ధీమా వ్యక్తం చేశారు.

శర్వానంద్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.