
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ సినిమాకు ఏకంగా రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తమిళంలో కంటే తెలుగులో రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడంపై చర్చ మొదలైంది. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Key Points
తెలుగులో ఓ సినిమాకు ధనుష్ ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు.
తమిళంలో ధనుష్ రెమ్యునరేషన్ రూ.35 కోట్లలోపే ఉంటుందని నెటిజన్ల వాదన.
ధనుష్ నటించిన 'ఇడ్లీ కడాయి' (తెలుగులో 'ఇడ్లీ కొట్టు') బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు.
ధనుష్ పారితోషికం వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ ఫలితం, తెలుగులో క్రేజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే ఇడ్లీ కడాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు . నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది . ఈ మూవీని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు . ఈ సినిమా విడుదలైన తర్వాతే కాంతార థియేటర్లలోకి రావడంతో ఇడ్లీ కొట్టును ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు .
టాలీవుడ్ సినిమాకు ధనుష్ భారీ డిమాండ్
అయినప్పటికీ కోలీవుడ్ హీరో ధనుశ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది . ముఖ్యంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది . ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ డైరెక్టర్ , నిర్మాతతో కలిసి ధనుశ్ తో ఓమూవీ చేసేందుకు సంప్రదించారట . ఆయనను కలిసి కథ కూడా వివరించినట్లు తెలుస్తోంది . అయితే ఈ కథ విన్న ధనుశ్ ఏకంగా రూ .50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్ . ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది .
తమిళం vs తెలుగు: పారితోషికం వివాదం
ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది . తమిళంలో ధనుశ్ కు ఇచ్చేది కేవలం రూ .35 కోట్లలోపే రెమ్యునరేషన్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అలాంటిది తెలుగులో రూ .50 కోట్లు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు . అయితే ధనుశ్ ను ఎవరు కలిశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు . రాబోయే రోజుల్లో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది .
ధనుష్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. తమిళంలో ఒకలా, తెలుగులో మరొకలా రెమ్యునరేషన్ అడగడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


