|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ష‌ర్వానంద్ సంచ‌ల‌నం! నిర్మాత కోసం రెమ్యున‌రేష‌న్ వ‌ద్దు.. టాలీవుడ్ షాక్!

Published: 24-01-2026, 10:35 PM
ష‌ర్వానంద్ సంచ‌ల‌నం! నిర్మాత కోసం రెమ్యున‌రేష‌న్ వ‌ద్దు.. టాలీవుడ్ షాక్!
  • శర్వానంద్ కొత్త సినిమా: అనిల్ సుంకర నిర్మాణంలో!
  • రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసేందుకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
  • నారి నారి నడుమ మురారి మూవీతో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్
  • సంక్రాంతికి విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టిన నారి నారి నడుమ మురారి

టాలీవుడ్ హీరో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నిర్మాత అనిల్ సుంకర గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అనిల్ సుంకరతో శర్వానంద్ మూవీ.. పారితోషికం తీసుకోరా?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఆయన ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటించారు.

శర్వానంద్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసల వర్షం

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కించారు. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఈ క్రమంలో హీరో శర్వానంద్ చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా నారి నారి నడుమ మురారి సక్సెస్ మీట్‌లో పాల్గొన్న శర్వానంద్ మాట్లాడుతూ.. ‘నాకు అనిల్ గారు అని పిలవడం కంటే అనిల్ అన్నా అని పిలవడం చాలా ఫీలింగ్ ఉంటది.

నారి నారి నడుమ మురారి సక్సెస్ మీట్‌లో హీరో కామెంట్స్ వైరల్

ఒక హీరో ప్రొడ్యూసర్ కలిస్తే ఏమవుతుంది అనేది మేము చూపిస్తాము. నేను ప్రామిస్ చేస్తున్నాను నా నెక్స్ట్ సినిమాను నిర్మాత అనిల్ సుంకరతో చేస్తాను. అయితే అతను చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు తీసే స్థాయికి వెళ్లే వరకు అతనితో ఎన్ని సినిమాలు చేసినా పారితోషికం తీసుకోను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇది విన్న అతని ఫ్యాన్స్, నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

శర్వానంద్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అత‌ని అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.