|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శర్వా ‘బైకర్’: రిలీజ్ డేట్ ఫిక్స్! ఈసారి రికార్డులు షేక్ అవ్వాల్సిందే!

Published: 03-02-2026, 12:05 PM
శర్వా 'బైకర్': రిలీజ్ డేట్ ఫిక్స్! ఈసారి రికార్డులు షేక్ అవ్వాల్సిందే!
  • ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా ‘బైకర్’ గ్రాండ్ రిలీజ్!
  • 1990, 2000 బ్యాక్‌డ్రాప్‌లో రేసింగ్ యాక్షన్‌తో మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా!
  • యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం!
  • శర్వా మోటార్‌సైకిల్ రేసర్‌గా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా అలరించనున్నారు!

చార్మింగ్ స్టార్ శర్వానంద్ ‘బైకర్’ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఏప్రిల్ 3న ‘బైకర్’ విడుదల!

నారీ నారీ నడుమ మురారితో సంక్రాంతి బ్లాక్ బస్టర్‌ని అందుకున్న చార్మింగ్ స్టార్ శర్వా.. తన అప్ కమింగ్ మూవీ ‘బైకర్‌’తో బిజీగా ఉన్నాడు. ఇందులో మోటార్‌సైకిల్ రేసర్‌గా శర్వా ప్రేక్షకులను థ్రిల్ చేయడానున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని యూవి క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ , సాంగ్‌తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుందని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్లో శర్వా బైకర్ లుక్‌లో కనిపించడం అదిరిపోయింది. 1990, 2000 బ్యాక్ డ్రాప్‌లో సాగే “బైకర్” రేసింగ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్‌తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ ‘బైకర్’ అని హామి ఇస్తున్నారు టీమ్.

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రేసింగ్ యాక్షన్!

యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ చిత్రం!

శర్వా ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందు ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.