
Key Points
35 ఏళ్ల తర్వాత శివ సినిమా 4K లో రీ-రిలీజ్!
కూలీ థియేటర్లో శివ ట్రైలర్ ప్రదర్శనతో అభిమానుల ఉత్సాహం!
అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన సౌండ్, విజువల్స్‌తో శివ మరోసారి ప్రేక్షకుల ముందుకు!
నాగార్జున, ఆర్జీవీ, వెంకట్ కలయికలో శివ సినిమా రీ-రిలీజ్‌కు సంబంధించిన వార్తలు వైరల్‌గా!
శివ సినిమా రీ-రిలీజ్: 4K అనుభూతి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌సెట్ చేసిన మూవీ శివ. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల క్రిత రిలీజైన మరోసారి మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది . అయితే సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీ హంగులతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది . ఇటీవల అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ – రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు .
కూలీ థియేటర్‌లో ట్రైలర్ ప్రదర్శన
అంతేకాకుండా ఇవాళ కూలీ మూవీ రిలీజ్ సందర్భంగా శివ 4 కే ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు . రజినీకాంత్ కూలీ సినిమాకు ముందు శివ ట్రైలర్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు . థియేటర్ దద్దరిల్లిపోయేలా శివ పేరుతో మార్మోగిపోయేలా చేశారు . దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ ఆర్జీవీ ట్విటర్ లో షేర్ చేశారు . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆర్జీవీ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నామని నాగార్జున తెలిపారు.
అభిమానుల స్పందన: ఉద్వేగభరిత ప్రతిస్పందన
నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లిందని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్ ఇచ్చిందన్నారు. అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కి మార్చాం.. శివని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ అని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు..
మొత్తంగా, 35 ఏళ్ల తర్వాత శివ సినిమా 4K లో రీ-రిలీజ్ కావడం సినీ ప్రేమికులకు పండగే. అభిమానుల ఉత్సాహం ఈ సినిమా విజయానికి నిదర్శనం.


