
📌 Key Points
- శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ తొలిసారిగా డివోషనల్ జానర్‌లో నటిస్తున్నారు.
- రిపబ్లిక్ డే సందర్భంగా ‘ఇరుముడి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
- రవితేజ అయ్యప్ప మాల ధరించి ఇరుముడితో పోస్టర్‌లో కనిపించారు.
- శివ నిర్వాణ, రవితేజ కాంబినేషన్ చిత్రంపై సినీ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్‌లో ‘ఇరుముడి’ అనే కొత్త సినిమా వస్తోంది. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప భక్తునిగా కనిపించనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ
Shiva Nirvana: ప్రముఖ దర్శకుడిగా, స్క్రీన్ ప్లేయర్ రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు శివ నిర్మాణ (Shiva Nirvana). 2015లో నివేతా థామస్, హీరో నాని జంటగా వచ్చిన ‘నిన్ను కోరి’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అంతేకాదు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రచయితగా కూడా పనిచేశారు .మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శివ నిర్వాణ.. 2019లో నాగచైతన్య – సమంత జంటగా వచ్చిన ‘మజిలీ’ సినిమాకి కూడా దర్శకత్వం వహించి.. తన అద్భుతమైన దర్శకత్వ మెలకువలతో అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు నాగచైతన్య – సమంత జంటకు ఇది ఎవర్గ్రీన్ మూవీ అని చెప్పడంలో సందేహం లేదు.
ఆ తర్వాత 2021లో మళ్ళీ నానితో ‘టక్ జగదీష్’ సినిమా చేసి ఆకట్టుకున్న శివ నిర్వాణ.. 2023లో సమంత హీరోయిన్గా , విజయ్ దేవరకొండ హీరోగా ‘ఖుషి’ సినిమా చేసి పర్వాలేదనిపించుకున్నారు. అలా ఇప్పటివరకు లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన..తొలిసారి డివోషనల్ జానర్ లో రవితేజ తో కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యారు.అలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోంది అని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఎక్సైట్ గా ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే 2026 జనవరి 26 సందర్భంగా రిపబ్లిక్ డే ఇటు రవితేజ పుట్టినరోజు ఇలా రెండు అకేషన్స్ రావడంతో ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ రిలీజ్ చేశారు.
ఇందులో రవితేజ ఒక అమ్మాయిని ఎత్తుకొని అయ్యప్ప మాల ధరించి ఇరుముడి తల నెత్తుకొని ఉన్నట్టు ఫోటోని షేర్ చేశారు. పైగా ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇకపోతే రవితేజ తొలిసారి ఇలా డివోషనల్ జానర్ లో సినిమా చేస్తున్నారని తెలియడంతో అభిమానులు కూడా చాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు యాక్షన్ , కమర్షియల్, రొమాంటిక్ లవ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ తొలిసారి కొత్త ప్రయోగం మొదలుపెట్టారు. మరి ఇది ఆయనకు ఎలా కలిసొస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు
‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ విడుదల
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై రవితేజతో ప్రయాణం పై ఒక పోస్ట్ పంచుకున్నారు శివ నిర్వాణ. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఇరుముడి సినిమా నుండి విడుదలైన ఈ పోస్టర్ ను రవితేజ షేర్ చేస్తూ..” కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మిమ్మల్ని ఎంచుకుంటాయి. మళ్లీ అలాంటి కథలో భాగంగా నమ్మకాన్ని నడిపించడం అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ శివా నిర్వాణ , మైత్రి మూవీ మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ “స్వామియే శరణం అయ్యప్పతో ఇరుముడి” అంటూ నమస్కరిస్తున్న ఒక ఎమోజిని షేర్ చేశారు రవితేజ
ఇక దీనికి రీట్వీట్ గా శివ నిర్వాణ ట్వీట్ చేశారు.. “కొన్ని ప్రయాణాలు విశ్వాసంతో ప్రారంభమై నమ్మకంతో పెరుగుతాయి. మీలాంటి నటుడితో ఈ దైవ మార్గంలో నడవడం పట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నాను అన్న. స్వామియే శరణం అయ్యప్ప అనే ఈ కొత్త అధ్యాయం కోసం మరింత ఉత్సాహంగా ఉన్నాను” అంటూ శివ నిర్వాణ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రవితేజతో చేస్తున్న ఈ సినిమాపై చాలా ఎక్సైట్మెంట్ గా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి శివానిర్వాన దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని , వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Some journeys begin with faith and grow with trust.
Grateful to walk this path with an actor like you Anna❤️ 🤗
అభిమానుల్లో అంచనాలు
Excited for this new chapter called #Irumudi
Swamiye Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/lmILO8Arq3
— Shiva Nirvana (@ShivaNirvana) January 27, 2026
మొత్తానికి రవితేజ డివోషనల్ జానర్లో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం.


