
అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ చిత్రం ‘శివ’ రీ-రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ 4కె ట్రైలర్ తాజాగా విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వేడుకగా నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ట్రైలర్‌ను చూడండి.
Key Points
అక్కినేని నాగార్జున ఐకానిక్ చిత్రం 'శివ' రీ-రిలీజ్‌కు సిద్ధమైంది.
రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా 'శివ'.
అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వేడుకగా నవంబర్ 14న మళ్ళీ విడుదల.
సరికొత్త 4కె వర్షన్‌లో విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
‘శివ’ చరిత్ర, రామ్‌గోపాల్ వర్మ ప్రస్థానం
అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ కమర్షియల్ మూవీ ‘శివ’ రీరిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి వెండితెరపైకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కల్ట్ మూవీ శివను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
గూస్‌బంప్స్ తెప్పించిన 4కె ట్రైలర్
ఈ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే శివ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సరికొత్త 4కె వర్షన్‌లో శివ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, హీరోలు శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా శివ అంటూ పలవురు స్టార్స్ కామెంట్స్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం శివ 4కె ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
నవంబర్ 14న మళ్ళీ వెండితెరపై ‘శివ’
కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు రాం గోపాల్ వర్మ.
నాగార్జున ‘శివ’ 4కె రీ-రిలీజ్ ట్రైలర్ సినిమా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. నవంబర్ 14న థియేటర్లలో ఈ అనుభూతిని పొందవచ్చు.


