
నాగార్జున బ్లాక్‌బస్టర్ ‘శివ’ చిత్రం రీ-రిలీజ్ సందర్భంగా మీడియా మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జున పాల్గొన్నారు. శివ సీక్వెల్‌పై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Key Points
నాగార్జున 'శివ' రీ-రిలీజ్‌కు సిద్ధమైంది, 4K క్వాలిటీలో నవంబర్ 14న విడుదల కానుంది.
మీడియా మీట్‌లో ఆర్జీవీని 'శివ' సీక్వెల్, అక్కినేని వారసుల గురించి ప్రశ్నించారు.
శివ పాత్ర నాగార్జున కోసమే అని, ఇంకెవరినీ ఊహించుకోలేమని ఆర్జీవీ స్పష్టం చేశారు.
ప్రస్తుత సినిమాల్లో హీరోల 'టెన్షన్' లేని పాత్రలపై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
శివ రీ-రిలీజ్: ప్రమోషన్స్ అండ్ మీడియా మీట్
Shiva Sequel: అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. కేవలం బ్లాక్ బస్టర్ (Shiva Sequel)మూవీనే కాదు ఎవరు గ్రీన్ మూవీ కూడా. ఈ సినిమాను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత్ బ్రేకర్ గా నిలిచిన ఈ సినిమా విడుదలై 36 ఏళ్ళు గడుస్తున్న వేళ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా 4K క్వాలిటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
Janhvi Kapoor: బంగారు కలర్ డ్రెస్ లో బంగారంలా.. మెరిసిపోతున్న జాన్వీ.. ఫోటోలు
ఆర్జీవీకి సీక్వెల్ ప్రశ్న: అక్కినేని వారసుడిపై కామెంట్
తాజాగా మీడియా మీట్ కూడా నిర్వహించారు. ఈ మీట్ లో హీరో అక్కినేని నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఇందిలో భాగంగా మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ శివ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక ఈ మీడియా మీట్ లో ఒక రిపోర్టర్ ఆసక్తికర ప్రశ్న ఆర్జీవీని అడిగాడు.. శివ సినిమాకు సీక్వెల్ చేస్తే ఎవరితో చేస్తారు.. నాగ చైతన్య, అఖిల్ అని అడిగాడు. దానికి ఆర్జీవీ ఆయన స్టయిల్లోనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరు కాదు. శివ అనేడి నాగార్జున కోసం చేసిన సినిమా. ఆ పాత్రలో ఇంకెవరినీ ఊహించుకోలేం.
శివ పాత్రపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్యే వచ్చే సినిమాల్లో హీరో టెన్షన్ పడే సన్నివేశాలు పెట్టడంలేదు. ఇంట్రడక్షన్ సీన్/సాంగ్‌తోనే ఏదైనా చేయగలడు అని చెప్పేస్తున్నారు. కానీ, శివ సినిమాలో హీరో ఒక సాధారణ వ్యక్తి. కాబట్టి, హీరోయిజం ఎలివేట్ అయ్యింది. అందుకే మీరు తప్పకుండా శివ సినిమాను మళ్లీ ఎంజాయ్ చేస్తారు’’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆర్జీవీ తనదైన శైలిలో ఇచ్చిన ఈ కౌంటర్ ‘శివ’ చిత్రంపై ఆయనకున్న భావాన్ని స్పష్టం చేసింది. నాగార్జున మాత్రమే ఆ పాత్రకు సరిపోతారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


