|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోయిన్లకు శివాజీ క్లాస్: ‘పొట్టి బట్టల్లో అందం కాదు.. చీరకట్టే గొప్ప!’

Published: 22-12-2025, 1:04 PM
హీరోయిన్లకు శివాజీ క్లాస్: 'పొట్టి బట్టల్లో అందం కాదు.. చీరకట్టే గొప్ప!'
  • నటుడు శివాజీ తన ‘దండోరా’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • హీరోయిన్లు వేసుకునే పొట్టి డ్రెస్సులు అందం కాదని బహిరంగంగా వ్యాఖ్యానించారు.
  • చీరకట్టు, సంప్రదాయ దుస్తులే మహిళలకు నిజమైన అందమని శివాజీ అభిప్రాయపడ్డారు.
  • సౌందర్య, సావిత్రి, రష్మికలను ఆదర్శంగా చూపిన శివాజీ.. సాంప్రదాయ దుస్తులను సూచించారు.

నటుడు శివాజీ తాజాగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదానికి తెర లేపారు. ‘సామాన్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదు’ అంటూ, చీరకట్టు, సాంప్రదాయ దుస్తులే నిజమైన అందమని అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శివాజీ, రీ-ఎంట్రీలో సహాయక పాత్రలు చేస్తూ దూసుకెళుతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ షోలో మెరిసిన శివాజీ, ఇప్పుడు దండోరా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ స్పెషల్ రోల్ శివాజీ చేస్తున్నారు. నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

అందం అంటే ఏంటో వివరించిన శివాజీ

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులపై కామెంట్స్ చేసి, వివాదానికి తెర లేపారు. సామాన్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదంటూ ఫైర్ అయ్యారు. చీరకట్టు, సాంప్రదాయ దుస్తులు మాత్రమే అమ్మాయిలు కనిపించాలని స్పీచ్ ఇచ్చారు.

సావిత్రి, సౌందర్యను ఆదర్శంగా చూపిన శివాజీ

ఆడదానిలో అమ్మను చూసుకుంటామని, అలాంటి వాళ్లు చీరకట్టులో కనిపిస్తే ప్రకృతికి అందం వస్తుందని వివరించారు. అప్పట్లో సౌందర్య, సావిత్రి లాంటివారు చీరకట్టులో ఇండస్ట్రీని షేక్ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి తరంలో రష్మిక లాంటి హీరోయిన్లు పొట్టి డ్రెస్సులు వేసుకోకుండానే సక్సెస్ అవుతున్నట్లు హితువు పలికారు. ఇకనైనా పొట్టి బట్టలు కాకుండా, సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని సూచనలు చేశారు శివాజీ. తన మాటలు కొంతమందిని నొప్పిస్తాయి, కానీ వాటిని ఫాలో అవుతే బాగుంటుందని కోరారు. క్లిక్

శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాటలు కొంతమందిని నొప్పించినా, సంప్రదాయ దుస్తుల ఆవశ్యకతపై చర్చకు దారి తీశాయి. ఈ వివాదంపై హీరోయిన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.