|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుహాస్ గురించి శివాని షాకింగ్ కామెంట్స్! ఇండస్ట్రీలో ఆయనే నాకు అండగా ఉన్నారు: వైరల్!

Published: 11-02-2026, 1:05 AM
సుహాస్ గురించి శివాని షాకింగ్ కామెంట్స్! ఇండస్ట్రీలో ఆయనే నాకు అండగా ఉన్నారు: వైరల్!
  • సుహాస్, శివాని నాగరం జంటగా ‘హే భగవాన్’ మూవీ ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్!
  • హీరో సుహాస్ నాకు ఇండస్ట్రీలో మోస్ట్ సపోర్టీవ్ పర్సన్: హీరోయిన్ శివాని కామెంట్స్ వైరల్!
  • గోపి అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ‘హే భగవాన్’ నిర్మాణం!
  • ‘అంబాజిపేట’ తర్వాత సుహాస్‌తో ఇది నా రెండో సినిమా: శివాని ఎమోషనల్ కామెంట్స్!

టాలీవుడ్ లో సెన్సేషనల్ న్యూస్! హీరోయిన్ శివాని నాగరం హీరో సుహాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘హే భగవాన్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సుహాస్‌తో నా అనుబంధం: శివాని

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) కథానయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan). గోపి అచ్చర(Gopi Achara) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివాని నాగారం(Shivani Nagaram) హీరోయిన్‌గా నటిస్తోంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఆ సినిమాకు వివేక సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక వెన్నెల కిశోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, యాంకర్ స్రవంతి వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ శివాని అక్కడ హీరో సుహాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు సుహాత్‌తో ఇది రెండో సినిమా. వెరీ స్పెషల్ ఈ మూవీ నాకు.. ఎందుకంటే అంబాజిపేటలో సుహాస్ నాకు అన్ని విషయాల్లో చాలా సపోర్టీవ్‌గా ఉన్నాడు. నాకు ఇండస్ట్రీలో చాలా సపోర్టీవ్ పర్సన్ అంటే సుహాసే. అతను నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్‌గా.. అండ్ అతనితో మరో సారి స్క్రీన్ షేర్ చేసుకోవడం వెరీ వెరీ హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

‘హే భగవాన్’ మూవీ అప్‌డేట్స్

ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్!

శివాని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘హే భగవాన్’ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.