|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అందుకే కన్నప్ప సినిమాలో నటించలేదు : శివరాజ్‌ కుమార్‌

Published: 31-05-2025, 9:25 AM
అందుకే కన్నప్ప సినిమాలో నటించలేదు : శివరాజ్‌ కుమార్‌

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో శివరాజ్ కుమార్, మంచు మోహన్ బాబు పాల్గొన్నారు. శివరాజ్ కుమార్ కన్నప్ప సినిమాలో నటించకపోవడానికి కారణాన్ని వివరించారు.

Key Points

1

శివరాజ్ కుమార్ కన్నప్ప సినిమాలో నటించలేకపోవడానికి కారణం డేట్స్ సమస్య.

2

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది.

4

మంచు మోహన్ బాబు కన్నడ సినిమాలో విలన్ పాత్ర కోసం శివరాజ్ కుమార్ ను కోరారు.

కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌

మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప రిలీజ్‌కు రెడీ అవుతోంది. జూన్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ విషయంలో స్పీడ్‌ పెంచారు మేకర్స్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కన్నప్ప(Kannappa) టీమ్‌ బెంగళూరు వెళ్లింది. కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌(Shiva Rajkumar )తో కలిసి మంచు మోహన్‌ బాబు, విష్ణు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమా శివుడి పాత్రను పోషించమని తొలుత నన్నే అడిగారు. కానీ నా డేట్స్‌ కుదరకపోవడంతో నటించలేకపోయాను. ఈ సారి విష్ణు ఏం అడిగినా చేస్తాను. రెమ్యునరేషన్‌ నాకు సమస్యే కాదు’ అని చెప్పారు.

శివరాజ్‌ కుమార్‌ వివరణ

కన్నప్ప  చిత్రం గుఇరంచి మాట్లాడుతూ.. నాన్నగారు(రాజ్‌ కుమార్‌) నటించిన ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ చిత్రంలో కన్నప్ప పాత్ర చేశాను. ఆయనతో కలిసి ‘కన్నప్ప’ పాత్ర చేయాలంటే మొదట భయం వేసింది. ఆ తర్వాత ఆ పాత్రపై నాకు ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా ‘నేనిల్ల నేనిల్ల’ పాట చేస్తున్నప్పుడు మరింత ఆసక్తి ఏర్పడింది. 37ఏళ్ల తర్వాత అదే కథతో విష్ణు సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అన్నారు.

మోహన్‌ బాబు కోరిక

ఇక మోహన్‌ బాబు మాట్లాడుతూ.. ఏదైనా కన్నడ సినిమాలో నటిస్తే బాగుండేదని అని అనిపిస్తూ ఉండేది.  అప్పట్లో అంబరీష్‌ను అడిగితే, నవ్వి ఊరుకునేవాడు.  రాజ్‌కుమార్‌గారిని అడగాలంటే ధైర్యం సరిపోలేదు. ఆయన తనయుడు శివరాజ్‌ కుమార్‌ని ఒక కోరిక కోరుతున్నాను. ఆయన నటించే చిత్రంలో విలన్‌ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే విషయంపై రాజ్‌ కుమార్‌ స్పందిస్తూ..‘మోహన్‌ బాబు గొప్ప నటుడు. ఆయన నా చిత్రంలో విలన్‌గా నటిస్తానని అడిగారు కానీ.. నేను ఆ పాత్ర ఇవ్వను. ఒక అందమైన అన్నయ్య పాత్ర ఇస్తా. హై క్వాలిటీ రోల్‌ అది. నేను ఆయనతో ఫైట్‌ చేయాలనుకోవడం లేదు’అని నవ్వుతూ అన్నారు.

చివరగా, శివరాజ్ కుమార్ తన నిర్ణయం వివరిస్తూ, మంచు విష్ణు సినిమా విజయం కోసం శుభాకాంక్షలు తెలిపారు. మంచు మోహన్ బాబు కన్నడ సినిమాలో నటించాలనే కోరికను కూడా వెల్లడించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.