|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శోభన్ బాబుని 5000 కోట్లకు అధిపతిని చేసిన ఒక్క సలహా ఎవరిచ్చారో తెలుసా?

Published: 05-09-2025, 10:30 AM
శోభన్ బాబుని 5000 కోట్లకు అధిపతిని చేసిన ఒక్క సలహా ఎవరిచ్చారో తెలుసా?

ప్రముఖ నటుడు శోభన్ బాబు 5000 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారు. ఈ అపార సంపద వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. రఘురామ కృష్ణరాజు వెల్లడించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ చూద్దాం.

Key Points

1

శోభన్ బాబు తండ్రి ఇచ్చిన సలహా వల్లే ఆయన వేల కోట్ల ఆస్తుల అధిపతి అయ్యారు.

2

ఆ సలహా ఏంటంటే, సంపాదించిన ప్రతి రూపాయిని భూమి మీద పెట్టడం.

4

మురళీ మోహన్ కూడా ఈ విధానాన్ని అనుసరించారని రఘురామ కృష్ణరాజు తెలిపారు.

శోభన్ బాబు ఆర్థిక విజయం

శోభన్ బాబు ఆంధ్రా అందగాడు, సోగ్గాడు,అందాల నటుడు. తన అభిమానులు తనను హీరోగా మాత్రమే చూడాలని కోరుకున్న శోభన్ బాబు.. 60 ఏళ్ల తరువాత నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆర్ధిక క్రమశిక్షణకు మారుపేరులా నిలిచిన శోభన్ బాబు, తను సినిమాల్లో సంపాదించిన ప్రతీ పైసా వ్యాపారంలో పెట్టాడు. అంతే కాదు ఆయన రియల్ ఎస్టేట్ ద్వారా తన బిజినెస్ ను విస్తరించి దాదాపు 5 వేల కోట్ల వరకూ ఆస్తులు సంపాదించారు. ఈవిషయాన్ని రాజకీయ నాయకుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రీసెంట్ గా వెల్లడించారు. ఆయన శోభన్ బాబుపై ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ, ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చిన సీక్రేట్ సలహా గురించి మాట్లాడారు.

ఈవిషయాన్ని రాజకీయ నాయకుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రీసెంట్ గా వెల్లడించారు. ఆయన శోభన్ బాబుపై ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ, ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చిన సీక్రేట్ సలహా గురించి మాట్లాడారు.రఘురామకు శోభన్ బాబుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఇక ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, శోభన్ బాబుకు ప్రస్తుతానికి ఉన్న ఆస్తుల విలువ 4000 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

తండ్రి సలహా: భూమిపై పెట్టుబడి

ఈ అపార సంపద వెనుక ఒక సలహా ఉంది. శోభన్ బబు ఎదుగుదలకు ఆయన తండ్రి ఇచ్చిన ఒకే ఒక్క సలహా ప్రధాన కారణమని తెలిపారు. శోభన్ బాబుకు చిన్నప్పుడే ఆయన తండ్రి ఓ విషయాన్ని క్లియర్ గా చెప్పారు. “భూమి స్థిరంగా ఉంటుంది, జనాభా మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి సంపాదించిన ప్రతీ రూపాయిని భూమి మీదే పెట్టు”అని శోభన్ బాబు తండ్రి చెప్పారని రఘురామ వెల్లడించారు. ఆయన సలహా వల్లే శోభన్ బాబు 5000 కోట్ల వరకూ సంపాదించగలిగారట.

ఈ మాటను జీవిత సూత్రంగా మార్చుకున్న శోభన్ బాబు, చిన్నదశలో పదివేల పారితోషికం తీసుకునే రోజుల్లోనూ, తదుపరి సినిమా అడ్వాన్స్‌తో భూములు కొనేవారట. ఈ అర్థశాస్త్ర విధానం ఆయనను సంపన్నుడిగా తీర్చిదిద్దిందని, అదే తీరును నటుడు మురళీ మోహన్ కూడా అనుసరించారని రఘురామ గుర్తు చేశారు. శోభన్ బాబు జీవితం నిబద్ధతకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. ఆయన సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితం నుంచి పూర్తిగా వేరు చేసేవారట. ఇంట్లో ఒక్క సినిమా మ్యాగజైన్ కూడా ఉండదట. తన పిల్లలను సినిమాల్లోకి తీసుకురావాలన్న ఆలోచన కూడా చేయలేదని చెప్పారు.

క్రమశిక్షణతో కూడిన జీవితం

నటుడు హరనాథ్ అందం, అభినయాన్ని చూసి భయపడ్డానని, కానీ ఆయన వ్యసనాల వల్ల ఆయన కెరీర్ ఎలా కోల్పోయారో చూసిన తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలని శోభన్ బాబు భావించారని కూడా రఘురామ చెప్పినట్టు తెలిపారు. బయటకి పిసినారి అనే పేరు ఉన్నా, శోభన్ బాబు అనేక గుప్త దానాలు చేసేవారని రఘురామ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే శోభన్ బాబుకు అపార గౌరవం ఉండేదని, తన కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఎన్నో అవకాశాలు వచ్చాయని ఆయన గుర్తుచేసుకున్నారు.

శోభన్ బాబు జీవితం ఆర్థిక క్రమశిక్షణకు, నిబద్ధతకు నిదర్శనం. తండ్రి సలహా ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చింది. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.