
కార్తీక దీపం సీరియల్ లోని మోనిత పాత్రతో ప్రేక్షకులను అలరించిన శోభా శెట్టి, తాజా ఇంటర్వ్యూలో ఆమె పాత్రకు ప్రేక్షకులు ఎలా స్పందించారో వివరించారు. డాక్టర్ బాబు మరియు వంటలక్కల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Key Points
కార్తీక దీపం సీరియల్ లోని మోనిత పాత్రతో శోభా శెట్టికి భారీ ఫేమ్.
ఒక గ్రామంలో, డాక్టర్ బాబు, వంటలక్కను కలిపేయమని ఆమె కాళ్ళు పట్టుకున్నారని శోభా చెప్పారు.
మోనిత లాంటి పాత్రలు లేకపోవడం వల్ల తెలుగు సీరియల్స్ లో నటించడం లేదు.
త్వరలోనే కొత్త తెలుగు సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
కార్తీక దీపం తర్వాత శోభా శెట్టి జీవితం
Shobha Shetty : కార్తీక దీపం సీరియల్ తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. టీవీ ప్రేక్షకులు ఈ సీరియల్ కి, సీరియల్ లోని పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ సీరియల్ సీజన్ 2 నడుస్తుంది. ఈ సీరియల్ తో నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబుగా, ప్రేమి విశ్వనాధ్ వంటలక్కగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ లో మోనిత అనే నెగిటివ్ క్యారెక్టర్ లో శోభా శెట్టి నటించి ఫేమ్ తెచ్చుకుంది.
కార్తీక దీపం సీరియల్ లో శోభా శెట్టి వంటలక్కని ఇబ్బంది పెట్టె పాత్రలో, డాక్టర్ బాబు – వంటలక్కని దూరం చేయాలనే నెగిటివ్ పాత్రలో నటించింది. ఈ సీరియల్ తర్వాత టీవీ షోలు, బిగ్ బాస్ తో మరింత వైరల్ అయింది శోభా శెట్టి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా కార్తీక దీపం ఎఫెక్ట్ బయట ఎలా ఉందో చెప్పింది.
గ్రామస్థుల ప్రతిస్పందన
శోభా శెట్టి మాట్లాడుతూ.. ఒకసారి ఓ విలేజ్ కి వెళ్ళాను. అక్కడ ఓ ముసలావిడ వచ్చి నా చేతులు పట్టుకొని నువ్వు అలా చేయకు మోనిత, వంటలక్క – డాక్టర్ బాబుని కలుపు. వాళ్ళిద్దర్నీ కలిపేయ్ అని చెప్పింది. నేను అది సీరియల్ కలిపేస్తే అయిపోతుంది అని చెప్తే.. అదంతా నాకు తెలీదు, వాళ్ళను కలపండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని నా కాళ్ళ మీద పడబోయింది అని తెలిపింది.
కొత్త సీరియల్స్ గురించి
అయితే మళ్ళీ తెలుగులో సీరియల్ ఎందుకు చెయ్యట్లేదు అని అడగ్గా.. మోనిత రేంజ్ క్యారెక్టర్ మళ్ళీ రాలేదు, అందుకే చేయలేదు. ఇటీవలే ఒక కథ విన్నాను, బానే ఉంది. దాంట్లో కొన్ని ఛేంజెస్ చెప్పాను. అవి ఛేంజ్ చేసి, ఛానల్ తో మాట్లాడి చెప్తామన్నారు. అది ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. కంఫర్మేషన్ వస్తే త్వరలో కొత్త సీరియల్ తో వస్తాను అని తెలిపింది.
శోభా శెట్టి కొత్త సీరియల్ లో నటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మోనిత పాత్ర లాంటి కొత్త పాత్రల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె వెల్లడించారు.


