|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: జనాలతో నాకేం సంబంధం? తెగేసి చెప్పిన శోభిత ధూళిపాళ్ల!

Published: 24-01-2026, 3:05 AM
షాకింగ్: జనాలతో నాకేం సంబంధం? తెగేసి చెప్పిన శోభిత ధూళిపాళ్ల!
  • శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు: జనాల గురించి నేను పట్టించుకోను!
  • ‘చీకటిలో’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన శోభిత..ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీ!
  • నా వ్యక్తిత్వం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటా.. శోభిత కుండబద్దలు కొట్టినట్టు సమాధానం!
  • సమాజం కోసం నా నిర్ణయాలు మార్చుకోను.. తెగేసి చెప్పిన శోభిత ధూళిపాళ్ల!

టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పెళ్లి తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన మనసులోని మాటను బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

జనాలతో సంబంధం లేదన్న శోభిత కామెంట్స్ వైరల్!

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమైన శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)మళ్లీ వార్తల్లో నిలిచింది. పెళ్లి తర్వాత ఆమె నటించిన తొలి చిత్రం ‘చీకటిలో’(Cheekatilo) జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈక్రమంలో.. తాజాగా, శోభిత ప్రమోషన్స్‌లో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన వ్యక్తిగత అభిప్రాయాలను, వృత్తిపరమైన నిర్ణయాలను పంచుకున్నారు.

రీఎంట్రీలో శోభిత ధూళిపాళ్ల సంచలన నిర్ణయం!

‘పెళ్లైన తర్వాత వస్తున్న మొదటి సినిమా కదా.. జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు?’ అని యాంకర్ ప్రశ్నించగా, శోభిత చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ‘‘జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు. వైజాగ్‌లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు నచ్చిన పనులే చేస్తున్నాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నా మనసుకి నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నాను.

నా ఇష్టం.. నా నిర్ణయం: శోభిత ధూళిపాళ్ల స్ట్రాంగ్ రిప్లై!

నేను నమ్మిన ప్రాజెక్ట్‌ను ఎప్పుడూ నిజాయితీగా చేస్తాను. నేను చేసే పని వల్ల జనాలు మెచ్చుకుంటారా లేదా నొచ్చుకుంటారా అని నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక నటిగా నాకు నచ్చిన పాత్రకు న్యాయం చేయడమే నా బాధ్యత’’ అని శోభిత చెప్పింది. సమాజం లేదా ప్రేక్షకుల అభిప్రాయాల కోసం తన నిర్ణయాలను మార్చుకోనని ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

శోభిత ధూళిపాళ్ల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె తదుపరి ప్రాజెక్టులు, మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.