
📌 Key Points
- చైనా నటి జాంగ్ జింగ్‌యి రెడ్ కార్పెట్‌పై పసుపు ప్లాస్టిక్ కవర్‌తో దర్శనం – వైరల్ ఫోటో!
- బలెన్సియాగా డిజైన్ అంటూ రూ. 1.5 లక్షల ధర అని ప్రచారం – అసలు నిజం వేరే!
- ‘ది వన్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్లాస్టిక్ కవర్ – పాత్రకు గుర్తుగా ఎత్తుకున్న నటి.
- వినికిడి లోపం ఉన్న తల్లిదండ్రుల కమ్యూనికేషన్ సాధనంగా కవర్ – సినిమాలో కీలక పాత్ర!
ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకం తగ్గించమని చెబుతున్న ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ఏకంగా రెడ్ కార్పెట్ మీద లక్షన్నర రూపాయల ప్లాస్టిక్ కవర్ పట్టుకుని వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి!
రెడ్ కార్పెట్‌పై ప్లాస్టిక్ బ్యాగ్.. అసలు కథేంటీ?
Plastic Bag Red Carpet : ప్లాస్టిక్‌ని బ్యాన్ చేయమని మన ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు, సెలబ్రిటీలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అలానే మాల్స్, దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను డబ్బులకు అమ్ముతున్నారు. ఇలా అయితేనన్నా కొనకుండా ఉంటారనే ఉద్దేశంతో. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు దాన్ని కూడా అమ్ముతుంటే.. ఓ నటి మాత్రం ఏకంగా లక్షన్నర పెట్టి ప్లాస్టిక్ కవర్ కొన్నది. పైగా దాన్ని పట్టుకుని రెడ్ కార్పెట్ మీద ఫోజులివ్వడంతో రాత్రికి రాత్రే ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
చైనా నటి జాంగ్ జింగ్‌యి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. కారణం ఏమిటంటే, ఆమె 2025 బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడిచినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిల్లో అందరినీ ఆకర్షిస్తోంది ఆ నటి వేసుకున్న డ్రెస్, నగలు, ఆమె బ్యూటీ కాదు. ఆమె చేతిలో పట్టుకున్న పసుపు రంగు ప్లాస్టిక్ కవర్ బ్యాగ్. సాధారణంగా కిరాణా సరుకులు తీసుకెళ్లడానికి లేదా చెత్త వేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగ్‌ని.. ఆమె పర్స్, బ్యాగ్‌లా ధరించి రెడ్ కార్పెట్ మీదకు తీసుకురావడంతో అది ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది.
లక్షన్నర పెట్టి ప్లాస్టిక్ కవరా? నెటిజన్స్ షాక్!
ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ నిజానికి లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా డిజైన్ అని ప్రచారం చేయడం ప్రారంభించారు. మరికొందరు అయితే ఆ బ్యాగ్ ధర సుమారు 1,790 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1,65,647) ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. లక్షన్నర పెట్టి ప్లాస్టిక్ కవర్ కొన్నావా అంటూ నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం నిజం కాదని తెలిసింది.
సినిమా ప్రమోషన్ కోసం ఇంత రిస్కా? వైరల్ అవుతున్న పిక్!
సదరు నటి చేతిలో పట్టుకున్నది సాధారణ ప్లాస్టిక్ కవర్ మాత్రమే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె దాన్ని పట్టుకుని వచ్చింది. జాంగ్ నటించిన “The One” అనే చిత్రంలోని తన పాత్రకు గుర్తుగా ఆమె చేతిలో ప్లాస్టిక్ కవర్ తో రెడ్ కార్పెట్ మీద ఫోజులిచ్చింది. ఆ సినిమాలో పసుపు రంగు ప్లాస్టిక్ కవర్.. జాంగ్ పాత్ర.. ఆమె వినికిడి లోపం ఉన్న తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అసలు విషయం తెలిసినా దీనిపై చర్చ ఆగడం లేదు. ఒక్క ఫోటోతో ఈ ప్లాస్టిక్ కవర్ ట్రెండింగ్‌లో నిలవడం మాత్రం విశేషం.
ఒక్క ప్లాస్టిక్ కవర్‌తో జాంగ్ జింగ్‌యి రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. సినిమా ప్రమోషన్ ఐడియా అదిరింది అంతే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


