
📌 Key Points
- రణవీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా థియేటర్లలో 700 కోట్ల వసూళ్లు దాటింది.
- నెట్‌ఫ్లిక్స్ ‘ధురంధర్’ ఓటీటీ రైట్స్‌ను 285 కోట్లకు కొనుగోలు చేసింది.
- బాలీవుడ్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన ఓటీటీ రైట్స్ రికార్డు ‘ధురంధర్’ పేరిట.
- ఈ సినిమా జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
రణవీర్ సింగ్ ‘ధురంధర్’ బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో భారీ విజయం సాధించడంతో పాటు, ఓటీటీ రైట్స్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ 285 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసి, బాలీవుడ్‌లో అత్యధిక ధర రికార్డును నెలకొల్పింది.
థియేటర్లలో ‘ధురంధర్’ సంచలనం!
Dhurandhar : రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన బాలీవుడ్ సినిమా ధురంధర్ ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఇండియా – పాకిస్థాన్ మధ్య జరిగిన కొన్ని రియల్ సంఘటనలతో, జాతీయభావంతో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ ని కురిపిస్తుంది. బాలీవుడ్ తో పాటు దేశమంతా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది.(Dhurandhar)
ఇప్పటికే ధురంధర్ సినిమా థియేటర్స్ లో 700 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం. తాజాగా ఈ సినిమాపై వచ్చిన ఓ వార్త చర్చగా మారింది.
నెట్‌ఫ్లిక్స్ డీల్: బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు!
ధురంధర్ సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయట. ధురంధర్ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 285 కోట్లు పెట్టి కొనుక్కున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా ధురంధర్ నిలుస్తుంది.
పార్ట్ 2 అప్‌డేట్ & స్ట్రీమింగ్ డేట్
ఈ రేట్ విని బాలీవుడ్ సినీ పరిశ్రమ ఆశ్చర్యపోతుంది. గతంలో పుష్ప 2, RRR సినిమాలకు ఈ రేంజ్ లో ఓటీటీ బిజినెస్ అయింది. బాలీవుడ్ లో అయితే ఇదే మొదటిసారి కావడంతో ధురంధర్ మరింత వైరల్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కి వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేయగా అది మార్చ్ లో రిలీజ్ అవుతుందని సమాచారం.
‘ధురంధర్’ సాధించిన రికార్డుల విజయం బాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ చరిత్ర సృష్టించిన ఈ చిత్రం, రాబోయే సినిమాలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది.


