|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ నిజం: ఎన్టీఆర్ ను ‘నాన్నా’ అని పిలిచే ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు? ఇద్దరు లేరు! వైరల్ అవుతున్న మిస్టరీ!

Published: 30-06-2026, 12:07 AM
షాకింగ్ నిజం: ఎన్టీఆర్ ను 'నాన్నా' అని పిలిచే ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు? ఇద్దరు లేరు! వైరల్ అవుతున్న మిస్టరీ!
  • యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలిచే ముగ్గురు స్టార్స్ వివరాలు ఇవే.
  • నందమూరి హరికృష్ణ, రియల్ స్టార్ శ్రీహరి ఇప్పుడు మన మధ్య లేరు, కానీ వారి ప్రేమ అమరం.
  • అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను ఎప్పుడూ ‘నాన్నా’ అనే పిలుస్తూ ప్రత్యేక అనుబంధం చాటుకుంటారు.
  • తారక్ తో కలిసి ఒక్క సినిమా చేసినా, శ్రీహరితో బంధం ఎంత బలపడిందో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలోని ముగ్గురు స్టార్ హీరోలు తారక్ ను ‘నాన్నా’ అని ఆప్యాయంగా పిలిచే రహస్యం బయటపడింది. వారిలో ఇద్దరు ఈ లోకంలో లేకపోవడం అందరినీ కలచివేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

తారక్ తో కళ్యాణ్ రామ్ ప్రత్యేక అనుబంధం!

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన్ను ఇష్టపడనివారు ఉండరు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకుని వెళ్లడం తారక్ కు బాగా అలవాటు. ఇక టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఎన్టీఆర్ ను వరసలు పెట్టి పిలుస్తుంటారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ బావా బావా అని పిలుచుకుంటారు.. మహేష్ బాబుని అన్నా అని పిలుస్తాడు ఎన్టీఆర్. రామ్ చరణ్ ను బ్రదర్ అని పిలుస్తాడు.. ఇక ఎన్టీఆర్ ను కూడా చాలా ప్రేమగా నాన్నా అని పిలిచే ముగ్గరు హీరోలు ఎవరో తెలుసా? అందులో ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఈ లోకంలో లేరు.

నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు కానీ కళ్యాణ్ రామ్ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయాడు. దాంతో నిర్మాతగా, హీరోగా రాణిస్తున్నాడు. పలు వ్యాపారాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను ఎప్పుడు నాన్నా అనే పిలుస్తుంటాడు. ఇద్దరు తల్లులు వేరైనా.. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనుబంధంతో కలిసి మెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా.. ఎక్కువగా ఇద్దరు కలిసే వెళ్తుంటారు. ఎన్టీఆర్ చాలా సినిమాలను కళ్యాణ్ రామ్ నిర్మించారు.

ఎన్టీఆర్ ను ‘నాన్నా’ అని పిలిచిన తండ్రి హరికృష్ణ!

నిజానికి ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచిన మొదటి వ్యక్తి ఆయన తండ్రి హరికృష్ణ. ఎన్టీఆర్ కు తండ్రి అంటే చాలా ఇష్టం ఆయన్ను చాలా ప్రేమించేవాడు. ఎప్పుడు తండ్రి గురించి చాలా గొప్పగా చెపుతుంటాడు. హరికృష్ణ కూడా జూనియర్ ను ఎప్పుడూ నాన్నా నాన్నా అనే పిలిచేవారు. ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఏదైనా ఈవెంట్లలో అయినా.. బహిరంగ ప్రదేశాల్లో కూడా నాన్నా అనే పిలిచేవారు హరికృష్ణ. 8 ఏళ్ల క్రితం ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కు ఆయన అన్న కళ్యాణ్ రామ్ పెద్ద దిక్కుగా ఉన్నారు. అందుకే తండ్రిలాగా కళ్యాణ్ రామ్ కూడా తారక్ ను నాన్నా అని పిలుస్తుంటారు.

ఇక ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచే మూడో వ్యక్తి ఎవరో కాదు రియల్ స్టార్ శ్రీహరి. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక్క సినిమా మాత్రమే చేశారు. కానీ ఆ సినిమాతో వారి అనుబంధం చాలా బలంగా పాతుకుపోయింది. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. సొంత మనుషుల్లా కలిసిపోయారు. శ్రీహరి బృందావనం సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు.

‘రియల్ స్టార్’ శ్రీహరితో ఎన్టీఆర్ సాన్నిహిత్యం!

సినిమా ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ.. ”ఎన్టీఆర్ తో నటించాలి అని చెప్పినప్పుడు పెద్దింటి బిడ్డ కదా.. పొగరు ఉంటుందేమో అని అనుకున్నాను.. కానీ సెట్లో కలిశాక ఎంత మంచివాడో అర్ధం అయ్యింది. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నాన్నా అనే పిలుస్తా” అని అన్నారు. శ్రీహరి కూడా ఇప్పుడు ఈ లోకంలో లేరు. అనారోగ్య కారణాల వల్ల ఆయన 49 ఏళ్ళ చిన్న వయసులోనే కన్ను మూశారు. ఇలా ముగ్గురు హీరోలు ఎన్టీఆర్ ను నాన్నా అని పిలుస్తుంటారు.

ఎన్టీఆర్ వ్యక్తిత్వం, అందరితో ఆయనకున్న అనుబంధం ఈ కథనంతో మరోసారి రుజువైంది. ముగ్గురు స్టార్స్ ‘నాన్నా’ అని పిలిచే ఈ అద్భుతమైన బంధం నిజంగా అపురూపం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన టాలీవుడ్ వార్తల కోసం మాతోనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.