|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Shraddha Kapoor: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రద్ధా కపూర్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

Updated: 28-05-2025, 8:27 AM
Shraddha Kapoor: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రద్ధా కపూర్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ‘స్త్రీ-2’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కే తదుపరి చిత్రంలో నటించే అవకాశం దక్కింది. మహారాష్ట్ర సంస్కృతి నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

Key Points

1

శ్రద్ధా కపూర్ 'స్త్రీ-2' తో భారీ విజయం సాధించారు.

2

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఆమె నటించే అవకాశం ఉంది.

4

దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

‘స్త్రీ-2’ తర్వాత శ్రద్ధా కపూర్ కొత్త అవకాశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor).. గత ఏడాది వచ్చిన ‘స్త్రీ-2’ (Stree-2) తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. శ్రద్ధా కపూర్‌తో పాటు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ-2 కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకు పైగానే రాబట్టి సూపర్ సక్సెస్‌ను ఇచ్చింది. ఇప్పుడు స్త్రీ ఫ్రాంచైజీలో స్త్రీ-3 కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది శ్రద్ధా. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకోబోతున్నట్లు తెలుస్తుంది.

లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి చిత్రం విశేషాలు

రీసెంట్‌గా వచ్చిన ‘ఛావా’ (Chhaava) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar). విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్ తన నెక్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దాదాపు శ్రద్ధా కపూర్‌ను ఫిక్స్ చేసేందుకు చూస్తున్నాడట లక్ష్మణ్ ఉటేకర్. మహారాష్ట్ర సంస్కృతి ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా స్క్రిప్ట్ శ్రద్ధాకు కూడా నచ్చినట్లు తెలుస్తుంది. దీంతో శ్రద్ధా కపూర్, లక్ష్మణ్ ఉటేకర్ కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా.. దీనికి దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

మహారాష్ట్ర సంస్కృతి నేపథ్యం

SHRADDHA KAPOOR IN TALKS FOR LAXMAN UTTEKAR’S NEXT AFTER CHHAAVA! After the success of #Stree2 , #ShraddhaKapoor may reunite with #DineshVijan & #LaxmanUttekar for a powerful new film rooted in #Maharashtrianculture . Based on a Marathi novel, she’s loved the script & is likely to… pic.twitter.com/y749qSpwsD

శ్రద్ధా కపూర్ కెరీర్‌లో మరో ముఖ్యమైన అడుగు ఇది. లక్ష్మణ్ ఉటేకర్‌తో కలిసి ఆమె చేసే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.