|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీల గ్లామర్ పని చేసిందా? జూనియర్ మూవీకి మూడు రోజులు ఎన్ని కోట్లు?

Published: 20-07-2025, 11:41 AM
శ్రీలీల గ్లామర్ పని చేసిందా? జూనియర్ మూవీకి మూడు రోజులు ఎన్ని కోట్లు?

కొత్త హీరో కిరీటీ నటించిన జూనియర్ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీలీల, జెనీలియా నటించిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Key Points

1

జూనియర్ మూవీ మూడు రోజుల్లో రూ.8 కోట్లు వసూలు చేసింది.

2

శ్రీలీల గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందని అభిప్రాయాలు.

4

25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్లలో విడుదలైంది.

జూనియర్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

కొత్త హీరో సినిమా జూనియర్ థియేటర్లలో హల్ చల్ చేస్తోంది. జూలై 18న ఈ మూవీ రిలీజైంది. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. టాలీవుడ్ బేబీ డాల్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత జెనీలియా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూనియర్ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మరి ఆ మూవీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం.

జూనియర్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ గాలి కిరీటీ రెడ్డి సినిమాకు కలెక్షన్స్ డీసెంట్‌గా వస్తున్నాయని ట్రేండ్ పండితులు అంటున్నారు. ఈ రోజు ఆదివారం (జులై 20) కావడంతో జూనియర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మంచి బుకింగ్స్ జరిగినట్లు సాక్‌నిల్క్ వెబ్ సైట్ చెబుతోంది. సాయంత్రం 4 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 25.50 శాతం, కన్నడ వెర్షన్‌లో 23.25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. రెండో రోజు బుకింగ్స్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

శ్రీలీల గ్లామర్ ప్రభావం

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.80 కోట్లు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 20 లక్షల రూపాయల చొప్పున జూనియర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్ల వసూళ్లు రాబడుతుందని చెబుతున్నారు. మూడు రోజుల్లో కలిపి జూనియర్ కలెక్షన్లు రూ.8 కోట్లకు చేరాయి. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.12 కోట్లు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

జూనియర్ చిత్రాన్ని రూ.25 బడ్జెట్‌‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రాఫిట్లోకి రావాలంటే రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీని 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

లాభాల్లోకి వెళ్లే అవకాశాలు

జూనియర్ సినిమాలో కిరీటీ పక్కన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. జెనీలియా, రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు నటించారు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి డైరెక్టర్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా వైరల్ వయ్యారి తెగ వైరల్ అయింది. శ్రీలీల గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయింది.

మొత్తం మీద, జూనియర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. లాభాలను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.