|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

25 ఏళ్లుగా శ్రియ క‌ల‌.. నెర‌వేరేనా ఈసారైనా?

Published: 12-02-2026, 7:05 AM
  • శ్రియ శరణ్ 25 ఏళ్లుగా ఒక నాట్య కళాకారిణి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారు.
  • ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
  • శ్రియ మొదట ‘ఇష్టం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
  • ప్రస్తుతం దృశ్యం 3 హిందీ చిత్రంలో శ్రియ నటిస్తున్నారు.

ప్రముఖ నటి శ్రియ శరణ్ గత 25 సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన కోరికతో ఎదురు చూస్తున్నారు. ఆమె నాట్య కళాకారిణి పాత్రలో నటించాలని ఆశపడుతున్నారు. ఆమె సినీ జీవితం గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రియ శరణ్ సినీ ప్రస్థానం

Shriya Saran:మనిషి అన్నాక జీవితంలో కోరికలు ఉండడం సహజం.. అయితే ఆ కోరికలను కొంతమంది నెరవేర్చుకుంటే.. మరికొంతమంది వాటిని నెరవేర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది మరణించినా.. ఆ కోరికలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం 25 ఏళ్లుగా ఆ ఒక్క కోరికను నెరవేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ స్టార్ బ్యూటీ శ్రియా శరణ్ (Shriya Saran).

అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఉత్తరప్రదేశ్ లోని హరిద్వార్లో పుట్టిన ఈమె 2001లో ‘ఇష్టం’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న శ్రియ.. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అగ్ర కథానాయికగా ఎదిగింది. ముఖ్యంగా తమిళంలో విజయ్, ధనుష్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో ఎలాగైతే నటించిందో.. ఇటు తెలుగులో చిరంజీవి, నాగార్జున , బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో కూడా జతకట్టి క్రేజీ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.

నాట్య కళాకారిణిగా నటించాలనే కోరిక

ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ నటనకు దూరం కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం దృశ్యం 3 హిందీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె హీరోయిన్ గానే కాదు మంచి నృత్య కళాకారిణి కూడా.. ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించాను. అయితే నేను మొదట ప్రేమించేది నటనను కాదు నాట్యాన్ని అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అందులో భాగంగానే మీరు నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా? అని అడగగా..ఆమె మాట్లాడుతూ.. “నాకు నాట్య కళాకారిణి పాత్రలో నటించాలనే కోరిక గత 25 సంవత్సరాలుగా ఉండిపోయింది. ఒక నాట్య కళాకారిణి గా జీవితపయనాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తన కెరీర్ మొత్తంలో ఎవరూ కూడా తనకు అలాంటి పాత్రను ఆఫర్ చేయలేదని, ఒకవేళ వస్తే మాత్రం అందులో తప్పకుండా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మరి భవిష్యత్తులోనైనా శ్రియా కోరికను ఏ డైరెక్టర్ నెరవేరుస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం శ్రియా కోరికను ఏ దర్శకుడు నెరవేరుస్తారో చూడాలి.

దృశ్యం 3 సినిమాలో శ్రియ

ఇక శ్రియ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2018లో వివాహం చేసుకొని రష్యాకు వెళ్ళిపోయిన ఈమె.. అక్కడే ఒక కూతురికి జన్మనిచ్చింది. కరోనా సమయంలోనే కుటుంబంతో గడిపిన ఈమె మళ్లీ 2021లో తనకు కూతురు పుట్టింది అనే విషయాన్ని బహిరంగంగా చెప్పింది. ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆర్ఆర్ఆర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇటీవల చిత్రంలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది శ్రీయ.

శ్రియ శరణ్ తన కోరికను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం. ఆమె కల నెరవేరడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తారో వేచి చూడాలి. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులు విజయవంతం కావాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.