|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లి చేసుకోను కానీ కచ్చితంగా తల్లిని అవుతా.. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సంచలన స్టేట్‌మెంట్.. షాక్‌లో నెటిజన్లు

Published: 11-07-2025, 6:16 AM
పెళ్లి చేసుకోను కానీ కచ్చితంగా తల్లిని అవుతా.. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సంచలన స్టేట్‌మెంట్.. షాక్‌లో నెటిజన్లు

తెలుగు, తమిళ చిత్రాల నటి శృతి హాసన్ తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, తల్లిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, కానీ తల్లి కావాలని కోరుకుంటున్నానని ఆమె వెల్లడించారు.

Key Points

1

శృతి హాసన్ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

పెళ్లి చేసుకోవడం తనకు భయంగా ఉందని, అది అవసరం లేదని తెలిపారు.

4

పిల్లలను దత్తత తీసుకుని సింగిల్ పేరెంట్‌గా పెంచాలని ఆమె ఆలోచిస్తోంది.

శృతి హాసన్ సంచలన ప్రకటన

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్(Shruti Haasan) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో హిట్ మూవీస్‌లో నటించిన శృతి హాసన్‌‌ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘పెళ్లి అంటేనే నాకు చాలా భయమేస్తోంది. వివాహ పద్ధతిని నేను గౌరవిస్తాను. కానీ నాకు మాత్రం అది అవసరం లేదనిపిస్తోంది.

గతంలో ఒకసారి నేను రిలేషన్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేవరు వెళ్లాను. కానీ పెళ్లి కాకుండానే ఆ ప్రేమ బంధం ముక్కలైంది. పెళ్లంటే ఇద్దరు మనుషుల ఏవమవడమే కాదు. జీవితాంతం ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవడం. పెళ్లంటే ఇష్టం లేదని నేను ఒంటరిగానే మిగిలిపోను. ఎప్పటికైనా తల్లి స్థానాన్ని పొందాలపుకుంటున్నాను. భవిష్యత్తులో పిల్లల్ని దత్తత తీసుకుంటాను. అప్పుడు నేను సింగిల్ పేరెంట్‌గా మాత్రం వారిని పెంచను. ఎందుకంటే నాకు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ కచ్చితంగా అవసరం. అయితే, ఒంటరి తల్లిదండ్రుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ప్రస్తుతం నన్ను నేను ప్రేమించుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ శృతి హాసన్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు.

పెళ్లిపై ఆమె అభిప్రాయాలు

తల్లి కావాలనే కోరిక

శృతి హాసన్ తన నిర్ణయంతో సమాజంలో చర్చను రేకెత్తించింది. ఆమె నిర్ణయం అనేక మందికి స్ఫూర్తినివ్వడమే కాకుండా, ఒంటరి తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరగాలని ఆమె కోరుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.