|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Shruti Haasan: ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. వైరల్‌గా మారిన పోస్ట్.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!

Published: 30-04-2025, 9:47 AM
Shruti Haasan: ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. వైరల్‌గా మారిన పోస్ట్.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!

ప్రముఖ నటి శృతి హాసన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి అందరినీ ఆందోళనకు గురి చేశారు. ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ వార్త వైరల్‌గా మారడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Key Points

1

శృతి హాసన్ ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

2

ఆమె ఏ వ్యాధితో బాధపడుతున్నారో వివరించలేదు.

4

ప్రస్తుతం శృతి 'కూలీ' సినిమాలో నటిస్తూ, 'జననాయగన్'లో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు.

శృతి హాసన్ ఆరోగ్యంపై ఆందోళన

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సూర్య, రవితేజ, మహేష్ బాబు(Mahesh Babu), రామ్ చరణ్, ఎన్టీఆర్, అజిత్ కుమార్(Ajith Kumar), దళపతి విజయ్, విజయ్ సేతుపతి, బాలకృష్ణ, వంటి వారితో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. చివరగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళానిధి మారణ్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రెబా మోనికా జాన్, జూనియర్ మగర్, మోనిషా బ్లాసీ నటిస్తున్నారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ చిత్రంతో పాటు శృతి హాసన్ అలాగే దళపతి విజయ్ ‘జననాయగన్’లో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, శృతి హాసన్ ఓ ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. కానీ ఆమె వచ్చిన వ్యాధి ఏంటో చెప్పలేదు. ప్రస్తుతం శృతి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు కంగారు పడిపోతున్నారు. ఆమెకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

‘కూలీ’ సినిమా షూటింగ్‌పై ప్రభావం?

శృతి హాసన్ ఆరోగ్యం గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఆమె సినిమా కెరీర్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.