|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Shwetha Menon: రాజన్న మూవీ నటిపై కేసు నమోదు..!

Published: 06-08-2025, 11:11 AM
Shwetha Menon: రాజన్న మూవీ నటిపై కేసు నమోదు..!

ప్రముఖ నటి శ్వేతా మీనన్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై అడల్ట్ చిత్రాల్లో నటించి ఆర్థిక లాభాలు పొందుతోందని ఆరోపణలు ఉన్నాయి. టాలీవుడ్ చిత్రం రాజన్నలో నటించిన శ్వేతా మీనన్ ఈ కేసుతో సంబంధం కలిగి ఉంది.

Key Points

1

ప్రముఖ నటి శ్వేతా మీనన్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.

2

ఆమె ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తోందని ఆరోపణ.

4

శ్వేతా మీనన్ తరఫున ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

కేసు నమోదుకు కారణం ఏమిటి?

ప్రముఖ నటి శ్వేతా మీనన్ ‌ పై కేసు నమోదైంది . ఆమెపై కేరళ పోలీసులు ఎఫ్ ‌ ఐఆర్ నమోదు చేశారు . శ్వేతా మీనన్ ‌ పై కేరళకు చెందిన మార్టిన్ మేనచేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు . తన ఆర్థిక లాభాల కోసం అడల్ట్ చిత్రాలు చేస్తోందని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు .

శ్వేతా మీనన్ ప్రతిస్పందన ఏమిటి?

తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు . గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు . డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఆరోపించారు . అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు . అయితే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు . ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

పోలీసుల దర్యాప్తు వివరాలు

కాగా .. శ్వేతా మీనన్ .. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ ‌, టాలీవుడ్ ‌ చిత్రాల్లోనూ కనిపించింది . టాలీవుడ్ ‌ లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది . బాలీవుడ్ ‌ లో అశోక , బంధన్ , హంగామా, రన్, కార్పొరేట్, శాండ్‌విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది . ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్ , వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్‌లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది . సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది .

ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేతా మీనన్ నుండి ఎటువంటి స్పందన లేదు. పోలీసుల దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.