|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: జక్కన్న ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె నటనకు ఫిదా అయ్యాడట!

Published: 15-01-2026, 2:30 AM
షాకింగ్: జక్కన్న ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె నటనకు ఫిదా అయ్యాడట!
  • రాజమౌళి దృష్టిలో యానీ అద్భుత నటి.. కళ్ళతోనే భావాలు పలికిస్తుందని ప్రశంసలు!
  • రాజన్న చిత్రంలో యానీ నటనకు ఫిదా అయిన జక్కన్న.. గతంలో ఇంటర్వ్యూలో వెల్లడి.
  • చైల్డ్ ఆర్టిస్టుగా యానీ నటనను మెచ్చుకున్న రాజమౌళి.. అప్పటినుంచే ఆమెకు అభిమానిగా మారారు.
  • ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి ‘వారణాసి’ మూవీ.. పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ గురించి రాజమౌళి స్వయంగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం!

యాని నటనకు జక్కన్న ఫిదా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటిదాకా.. ఆయన చేసిన ప్రతీ మూవీ సూపర్ హిట్. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఆయన మూవీలో చిన్న రోల్ అయినా కూడా నటించాలని భావిస్తారు. అంతటి పాన్ ఇండియా క్రేజ్ రాజమౌళిది.

జక్కన్న చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. పలు అవార్డులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’ మూవీ చేస్తున్నారు.

రాజన్న చిత్రంలో యాని అద్భుత నటన

దర్శకుడు రాజమౌళి తన కెరీర్‌లో ఎన్నో స్టార్ నటీనటులతో కలిసి పని చేశారు. ఎంతమందితో పని చేసినా.. ఆయనకు సావిత్రి, సూర్యకాంతం నటన అంటే చాలా ఇష్టం. అలాగే యంగ్ స్టార్స్‌లో మాత్రం జక్కన్నకు ఓ యంగ్ హీరోయిన్ నటనను అభిమానిస్తాడట.

నాగార్జున హీరోగా నటించిన ‘రాజన్న’ చిత్రం మీకు గుర్తుందా.? ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది ‘యాని’. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్‌ను రాజమౌళి డైరెక్ట్ చేశారట.

మహేష్ బాబుతో రాజమౌళి ‘వారణాసి’ మూవీ

రాజన్న చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన యానీ నటనకు తాను ఫిదా అయినట్టు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఓ పెద్ద సీన్‌లో చాలా ఈజీగా యానీ నటించిందని.. ఆమె కళ్లతోనే ఎమోషన్స్ పలికించిందని రాజమౌళి అన్నారు.

రాజమౌళి యాని నటనను మెచ్చుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.