|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Siddhant Chaturvedi: సచిన్ కూతురితో బాలీవుడ్‌ హీరో డేటింగ్‌..!

Published: 03-05-2025, 12:19 PM
Siddhant Chaturvedi: సచిన్ కూతురితో బాలీవుడ్‌ హీరో డేటింగ్‌..!

బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది గురించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఆయన సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై ఇద్దరూ స్పందించలేదు.

Key Points

1

సిద్ధాంత్ చతుర్వేది, సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు.

2

వీరిద్దరూ తమ సంబంధం గురించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

4

గతంలో సిద్ధాంత్‌కు నవ్య నవేలి, సారాకు శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ రూమర్స్ వచ్చాయి.

సిద్ధాంత్ చతుర్వేది – సారా టెండూల్కర్ డేటింగ్ రూమర్స్

బాలీవుడ్‌ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది గతేడాది యుధ్రా మూవీలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. ప్రస్తుతం సిద్ధాంత్ ధడక్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కూడా హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్‌ తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఆ తర్వాత సిద్ధాంత్‌ చతుర్వేది దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్‌ మూవీలో కనిపించనున్నారు.

వార్తలపై స్పందన లేదు

అయితే ఇదంతా పక్కనపెడితే సిద్ధాంత్‌ గతంలో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా హీరో సిద్ధాంత్ చతుర్వేది టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఈ విషయంపై సిద్ధాంత్‌ కానీ.. సారా టెండూల్కర్ కానీ స్పందించలేదు. రిలేషన్‌పై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు. కాగా.. సారా టెండూల్కర్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేకేషన్‌లో ఉన్నారు. అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

గతంలో వచ్చిన డేటింగ్ రూమర్స్

కాగా.. గతంలో సిద్ధాంత్ చతుర్వేది.. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తల్లో నిలిచింది. కానీ వీరిద్దరు కూడా తమ రిలేషన్‌ను ధృవీకరించలేదు. మరోవైపు శుభ్ మన్‌ గిల్.. సైఫ్ కూతురు సారా అలీ ఖాన్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గతంలో కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ సందర్భంగా సారా అలీ ఖాన్‌ ఈ విషయంపై ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతానికి ఈ వార్తలు రూమర్స్‌గానే ఉన్నాయి. సిద్ధాంత్ లేదా సారా ఈ విషయంపై స్పష్టతనిస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. ఇంతలో ఈ వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.