|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘3BHK’ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన సిద్ధార్థ్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

Published: 22-06-2025, 10:20 AM
‘3BHK’ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన సిద్ధార్థ్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ నటించిన ‘3BHK’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా సెకండ్ సింగిల్ పాట విడుదల తేదీని సిద్ధార్థ్ వెల్లడించారు. పాట పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

Key Points

1

సిద్ధార్థ్ నటించిన ‘3BHK’ సినిమా సెకండ్ సింగిల్ పాట విడుదలకు సిద్ధమవుతోంది.

2

‘ఆగిపోను నేను’ అనే పాటను దేవతివేద పాడారు.

4

జూలై 4న ‘3BHK’ సినిమా విడుదల కానుంది.

‘3BHK’ సెకండ్ సింగిల్ విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్(Siddharth) ఇటీవల ‘టెస్ట్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన త్వరలోనే ‘3BHK’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ గణేష్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్. శరత్‌కుమార్(Sharathkumar), దేవయాని, యోగి బాబు(Yogi Babu), మీటా రఘునాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 4న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, ‘3BHK’ సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘ఆగిపోను నేను’’ అని సాగే ఈ పాటను దేవతివేద పాడనున్నారు. ఇక ఈ విషయాన్ని వెల్లడిస్తూ సిద్ధార్థ్ కాలేజ్ బ్యాగ్ చేతికి వేసుకుని సంతోషంగా ఆకాశం వైపుకు చూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

సిద్ధార్థ్ కొత్త పోస్టర్

జూలై 4న సినిమా విడుదల

సిద్ధార్థ్ యొక్క ‘3BHK’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సెకండ్ సింగిల్ విడుదలతో అంచనాలు మరింత పెరిగి, జూలై 4 విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.