
📌 Key Points
- ‘రెట్టతల’ చిత్రంలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
- సిద్ధి ఇద్నాని పాత్ర పేరు ‘ఆండ్రి’, ఇది సినిమా కథను ముందుకు నడిపిస్తుంది.
- కేవలం డ్యాన్స్ చేసి వెళ్ళిపోవాలనుకోవడం లేదని, పాత్రకు ఉద్దేశం ఉండాలని సిద్ధి చెప్పింది.
- అరుణ్ విజయ్ 100% అంకితభావం గల నటుడని సిద్ధి ఇద్నాని ప్రశంసించింది.
అరుణ్ విజయ్ హీరోగా వస్తున్న ‘రెట్టతల’ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ సిద్ధి ఇద్నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రంలో తనది చాలా శక్తివంతమైన పాత్ర అని, ఇది కథను ముందుకు నడిపిస్తుందని ఆమె వెల్లడించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సిద్ధి ఇద్నాని ‘రెట్టతల’ విశేషాలు
కోలీవుడ్ స్టార్ అరుణ్ విజయ్(Arun Vijay) ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోవైపు హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘రెట్టతల’ (retta thala)ఒకటి. తిరుకుమరన్(Thirukumaran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాన్య రవిచంద్రన్, యోగేష్, జాన్ విజయ్, హరీష్ పెరాదిచ బాలాజీ మురుగదాస్, కీలక పాత్రలో కనిపించనుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుండగా.. ఇందులో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని (Siddhi Idnani)హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రెట్టతల’ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన సిద్ధి ఇద్నాని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నా మొదటి సినిమా ‘వెందు తనిందతు కాడు’ తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. కానీ ఈ పరిశ్రమలో మనం ఎప్పుడూ మరింత సాధించాలనే తపనతో ఉండాలి. ఈ సినిమాలో నాకు చాలా శక్తివంతమైన పాత్ర లభించింది. నేను కేవలం వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళిపోవాలనుకోవడం లేదు. ఒక మహిళా పాత్ర ప్రాముఖ్యతను నిరూపించాలనుకుంటున్నాను. ఈ సినిమాలో ఆండ్రి అనేది నా పాత్ర పేరు, ఇది చాలా బలమైన పాత్ర, ఇది సినిమా కథను కూడా ముందుకు నడిపిస్తుంది. నేను కేవలం పేరుకే హీరోయిన్ పాత్రలు చేయాలనుకోవడం లేదు, నేను ఎప్పుడూ పాత్రకు ఒక ఉద్దేశం ఉండాలని కోరుకుంటాను.
శక్తివంతమైన ఆండ్రి పాత్ర గురించి
నన్ను ఇందులో భాగం చేసిన ‘రెట్ట తల’ టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఇక BTG నిర్మాణ సంస్థ వారు భోజనం చాలు బాగుంటుంది నాకు నచ్చింది. పారితోషికం కూడా బాగా ఇస్తారు. నేను ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రతిభావంతుడైన నటుల్లో అరుణ్ విజయ్ ఒకరు. ఇప్పటివరకు నేను చూసిన వారిలో.. ఆయన 100శాతం అంకితభావం గల నటుడు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ ‘రెట్టతల’ మూవీపై అంచనాలను పెంచాయి.
అరుణ్ విజయ్‌పై సిద్ధి ప్రశంసలు
A post shared by Siddhi Idnani (@siddhi_idnani)
సిద్ధి ఇద్నాని వ్యాఖ్యలు ‘రెట్టతల’పై అంచనాలను అమాంతం పెంచాయి. తన పాత్ర ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే కాకుండా, అరుణ్ విజయ్ నటనను కొనియాడటం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


