|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సిద్దు జొన్నలగడ్డ ‘బాదాస్’ సినిమా అప్డేట్.. బ్లాస్ట్ చేయబోతున్నాడంటూ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్

Published: 09-07-2025, 4:02 AM

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ‘బాదాస్’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది.

Key Points

1

సిద్దు జొన్నలగడ్డ 'బాదాస్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.

2

రౌడీ బాయ్ లుక్‌లో సిద్దు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

4

సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది, వచ్చే ఏడాది విడుదల కానుంది.

‘బాదాస్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ మరో భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ‘బాదాస్’(Badass) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్ ప్రజెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘ఇఫ్ మిడిల్ ఫింగర్ వాస్ ఏ మ్యాన్’ ట్యాగ్ లైన్‌తో రాబోతుంది.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసి మూవీ మేకర్స్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ చేతికి వాచ్, గాగుల్స్ పెట్టుకుని సిగరెట్ తాగుతూ రౌడీ బాయ్ లుక్‌లో కనిపించగా.. ఆయన చుట్టూ పొగ ఓ కెమెరా, TV5 మైక్ కూడా కనిపించాయి. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ మాస్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ పోస్ట్‌కు ‘‘నువ్వు హీరోలను చూశావు… విలన్లను చూశావు.. కానీ ఇది నీ లేబుల్స్‌లోకి సరిపోయేలా ఇక్కడ లేదు. ఈసారి కనికరం లేదు.. బిగ్ స్క్రీన్‌ను బ్లాస్ట్ చేయబోతున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.

సిద్దు జొన్నలగడ్డ రౌడీ లుక్

సినిమా విడుదల తేదీ, నిర్మాణ వివరాలు

సిద్దు జొన్నలగడ్డ ‘బాదాస్’ సినిమా పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమై, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.