
80వ దశకంలో తన గ్లామర్, నటనతో టాలీవుడ్‌ను ఏలిన సిల్క్ స్మిత గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచిన ఓ సంఘటన నేటికీ చర్చనీయాంశంగా మారింది. సగం కొరికి వదిలేసిన యాపిల్ వేలంలో ఎంతకు అమ్ముడైందో తెలుసా?
Key Points
80వ దశకంలో సిల్క్ స్మిత టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది.
స్టార్ హీరోయిన్ల స్థాయిలో పారితోషికం అందుకున్న నటి.
షూటింగ్లో సగం కొరికి వదిలేసిన యాపిల్.
ఆ యాపిల్ వేలంలో రూ. 26 వేలకు అమ్ముడై చరిత్ర సృష్టించింది.
సిల్క్ స్మిత తిరుగులేని క్రేజ్
సిల్క్ స్మిత్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 80వ దశకంలో ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోయిన్ల రేంజులో రెమ్యునరేషన్ అందుకుంది. అంతేకాదు అప్పటి హీరోలకు సిల్క్ స్మిత సినిమాలో ఉంటే.. అది హిట్ అని అనుకునేవారు. అద్భుతమైన అందచందాలతో, మత్తెక్కించే చూపులతో, మైమరిపించే నాట్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తార సిల్క్ స్మిత.
ఆ సమయంలో సిల్క్ స్మిత క్రేజ్ మాములుగా లేదు. దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం ఎంతగానో ఎదురుచూసేవారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిల్క్ స్మిత.. కృష్ణంరాజు, సుమన్, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ వంటి అగ్ర నటులతో కలిసి నటించింది.
యాపిల్ వేలం వెనుక కథ
కెరీర్ స్టార్టింగ్‌లో సిల్క్ స్మిత కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ.. ఆపై స్టార్ హీరోయిన్లకు సాటిగా సినిమాలు చేసింది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంది. అందం, అభినయంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. అయితే చనిపోయే రోజుల్లో కూడా తీవ్ర కష్టాలు పడింది. ఆమె చనిపోయినప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ తప్పితే.. మరే హీరో చివరిచూపుకు వెళ్లలేదని సమాచారం.
సిల్క్ స్మిత గురించి ఓ ఆసక్తికర విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1984లో ఒక సినిమా షూటింగ్ విరామ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సిల్క్ స్మిత ఒక ఆపిల్ పండు తింటుండగా.. షాట్ రెడీ అని డైరెక్టర్ పిలుపు వచ్చింది. దీంతో ఆమె సగం కొరికిన ఆపిల్‌ను అక్కడే వదిలి షూటింగ్‌కు వెళ్ళిపోయింది.
వేలంలో యాపిల్ ధర ఎంతో తెలుసా?
ఇక ఆ సగం కొరికిన ఆపిల్‌ను ఆమె మేకప్‌మెన్ అక్కడికక్కడే వేలం వేయాలని నిర్ణయించాడు. సెట్‌లో ఉన్నవారు పోటీపడి మరీ ఆ ఆపిల్‌ను రూ. 26 వేలకు కొనుగోలు చేశారు. ఈ సంఘటన సిల్క్ స్మిత పట్ల అప్పట్లో ఉన్న విపరీతమైన అభిమానాన్ని, ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ను తెలియజేస్తుందని చెప్పొచ్చు.
సిల్క్ స్మితకు అప్పట్లో ఉన్న విపరీతమైన అభిమానాన్ని, ఆమె స్టార్‌డమ్‌ను ఈ యాపిల్ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. నేటి తరం నటీనటులకు కూడా అందని ఓ అరుదైన గౌరవం అది. ఇది ఆమె జ్ఞాపకాలను మరింత పదిలపరుస్తుంది.


