|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘దండోరా’తో నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌!

Published: 01-06-2025, 1:14 AM

రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దండోరా’ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ గాయని అదితి భావరాజు నటిగా అరంగేట్రం చేస్తున్నారు.

Key Points

1

‘దండోరా’ చిత్రంతో అదితి భావరాజు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

2

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథ

4

చిత్రీకరణ దశలో ఉన్న ‘దండోరా’ చిత్రం

అదితి భావరాజు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

‘క‌ల‌ర్‌ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలతో అందరిని ఆకట్టుకున్న నిర్మాత రవీంద్ర బెనర్జీ..ఇప్పుడు మరో వైవిధ్యమైన ప్రేమకథని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య  త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

‘దండోరా’ చిత్ర విశేషాలు

ఇప్పుడు టాలెంటెడ్ సింగ‌ర్ అదితి భావ‌రాజు న‌టిగా ఈ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను ఆల‌పించిన అదితి..‘దండోరా’ చిత్రంలో న‌టనా ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఆమె ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

తెలంగాణ గ్రామీణ నేపథ్యం

‘దండోరా’ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప‌లు కీల‌క షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్ బీట్ టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

‘దండోరా’ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ కు వచ్చిన అద్భుత స్పందనతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.