
నటి కేతికా శర్మ ‘సింగిల్’ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో ఆమె పాత్ర, తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆమె వివరించారు.
Key Points
కేతికా శర్మ 'సింగిల్' సినిమాలో ఆడీ కంపెనీ ఉద్యోగి పాత్ర పోషించారు.
ఆమె కామెడీ సన్నివేశాలను చాలా కష్టతరమైనవిగా భావించారు.
'రాబిన్ హుడ్' సినిమాలోని డ్యాన్స్ సన్నివేశాలపై వచ్చిన విమర్శలను గురించి ఆమె మాట్లాడారు.
ప్రస్తుతం ఆమె సింగిల్‌గా ఉండి, రిలేషన్‌షిప్ డ్రామాలు నచ్చవని తెలిపారు.
‘సింగిల్’ సినిమాలో కేతికా శర్మ పాత్ర
‘‘కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. హిట్, ఫ్లాప్స్ మన చేతిలో ఉండవు. ఓ నటిగా పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. ఇండస్ట్రీలో కొనసాగడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు కేతికా శర్మ. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘సింగిల్’. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్’ సినిమాలో ఆడీ కంపెనీలో పని చేసే పూర్వ అనే అమ్మాయిపాత్ర చేశాను.
కామెడీ సన్నివేశాలపై ఆమె అభిప్రాయం
పూర్వ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఈ మూవీలోని లవ్‌స్టోరీ వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అల్లు అరవింద్‌గారి సమర్పణలో గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా ఇంట్రవెల్ సీక్వెన్స్ చాలా సవాల్‌గా అనిపించింది. ఇక ‘రాబిన్ హుడ్’ సినిమాలో నేను చేసిన ‘అదిదా సర్‌ప్రైజ్’లాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఈ మూవీలో లేవు.
రిలేషన్‌షిప్స్ గురించి కేతికా శర్మ వ్యాఖ్యలు
సెట్స్‌లో దర్శకులు ఏదీ చెబితే అది చేస్తాను. అలా ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ చేశాను. ఈ సాంగ్‌లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌పై భిన్నా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్‌లో అలాంటి మూమెంట్స్‌పై జాగ్రత్తలు తీసుకుంటా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. మీరు లైఫ్‌లో సింగిల్‌గా ఉన్నారా? అన్న ప్రశ్నకు… ‘‘ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాను. రిలేషన్‌షిప్ అంటూ లేనిపోని డ్రామాలు నాకు నచ్చవు. నిజాయితీగా ఉండాలి. రైట్ పర్సన్ దొరికితే… ప్రేమిస్తాను’’ అని చె΄్పారు కేతికా శర్మ.
చివరగా, కేతికా శర్మ తన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో మరింత మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆమె ఆకాంక్షించారు.


