|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్! ‘నా బాడీ నా హక్కు’పై వైరల్ రచ్చ!

Published: 24-06-2026, 12:12 PM
సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్! 'నా బాడీ నా హక్కు'పై వైరల్ రచ్చ!
  • సింగర్ సునీత ‘నా బాడీ నా హక్కు’పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం.
  • శరీరాన్ని చూపించడం స్వేచ్ఛ కాదని సునీత కుండబద్దలు కొట్టిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది.
  • నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు, కానీ దానిని కరెక్ట్ అని చెప్పొద్దని సునీత స్పష్టం చేశారు.
  • సునీత వ్యాఖ్యలపై కొందరు మద్దతు, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వాదోపవాదాలు నడుస్తున్నాయి.

టాలీవుడ్ సింగర్ సునీత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి! ‘నా బాడీ నా హక్కు’ అనే అంశంపై ఆమె కుండబద్దలు కొట్టిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో చూద్దాం!

సునీత వ్యాఖ్యలపై టాలీవుడ్ లో దుమారం!

టాలీవుడ్ సింగర్ సునిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా బాడీ నా హక్కు అనుకుంటే చూసేవాడు నా కళ్లు నా ఇష్టం అని అంటాడని అన్నారు. శరీరాన్ని చూపించడం అసలు ఫ్రీడమ్ కిందకు రాదని అన్నారు. నీకు నచ్చిన దుస్తులు వేసుకో.. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు కానీ అది కరెక్ట్ అని చెప్పొద్దు అంటూ వ్యాఖ్యానించారు. సేఫ్ గా అనిపించినంతవరకు నీకు నచ్చిన దుస్తులు నువ్వు వేసుకోవచ్చని, ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. ఎవరి చూపులు నిన్ను తాకనప్పుడు, ఎవరూ నిన్ను చూడటంలేదని అనిపించినప్పుడు నీకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని చెప్పారు.

సినిమా ఇండస్ట్రీలో నటీమణులు డ్రెస్సింగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో సింగర్ సునిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సునిత మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో కొందరు సమర్దిస్తుంటే మరికొందరు ఆమె కామెంట్లను వ్యతిరేఖిస్తున్నారు. సునిత చేసిన కామెంట్లు అనసూయ, చిన్మయి లాంటి వాళ్లకు గట్టి సమాధానం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సునిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

‘నా బాడీ నా హక్కు’పై సునీత సంచలన వివరణ

అనసూయ, చిన్మయిలకు సునీత కౌంటర్?

సునీత చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె ధైర్యంగా చెప్పిన మాటలు ఎందరినో ఆలోచింపజేస్తున్నాయి. ఈ వివాదంపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.