|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ నిర్మలమ్మ ఒక్క అక్షరం కోసం 15 టేకులు, అర్థరాత్రి అయినా రాలేదు.. ఏం జరిగిందంటే?

Published: 20-07-2025, 1:10 PM
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ నిర్మలమ్మ ఒక్క అక్షరం కోసం 15 టేకులు, అర్థరాత్రి అయినా రాలేదు.. ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి నిర్మలమ్మ గురించి ఒక ఆసక్తికరమైన విషయం. ‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్’ గా పేరున్న ఆమె ఒక సినిమా షూటింగ్ లో ఎదుర్కున్న అనుభవం ఇది.

Key Points

1

సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరున్న నిర్మలమ్మ ఒక్క అక్షరం కోసం 15 టేకులు వేశారు.

2

మోహన్ బాబు హీరోగా నటించిన 'రాయుడు' సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది.

4

డైలాగ్ డెలివరీలో ఆమెకున్న ప్రావీణ్యతను ఈ సంఘటన చాటుతుంది.

నిర్మలమ్మ: తెలుగు సినిమాలో ఒక అరుదైన నటి

నటి నిర్మలమ్మ ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ముప్పై ఏళ్ల క్రితం ఆమె తెలుగు సినిమాని శాసించిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, డైరెక్టర్‌ ఎవరైనా నిర్మలమ్మ ఉండాల్సిందే.

ఆమె లేకుండా సినిమాలు రావడం చాలా తక్కువ. బామ్మగా ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు సినిమాల్లో బామ్మ పాత్ర అంటే ఆమెనే గుర్తుకు వస్తుంది. అంతగా తన పాత్రలతో ఆకట్టుకుంది నిర్మలమ్మ.

హీరోకిగానీ, హీరోయిన్ కి గానీ బామ్మ పాత్రలు పోషించి ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. అదే సమయంలో ఎమోషనల్‌గానూ కన్నీళ్లు పెట్టించింది.

ఏదేమైనా నిర్మలమ్మ సినిమాలో ఉంటే అదొక సాటిస్ఫాక్షన్‌. అది సినిమా వాళ్లకి, చూసే ఆడియెన్స్ కి కూడా. అయితే 2009లో ఆమె కన్నుమూశారు. తన నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో వెయ్యికిపైగా చిత్రాల్లో నటించింది నిర్మలమ్మ.

అయితే `రాయుడు` సినిమా సమయంలో ఆమె మీడియాతో ముచ్చటించింది. తాను 800 సినిమాలకుపైగా చేశానని తెలిపింది నిర్మలమ్మ.

‘రాయుడు’ సినిమా షూటింగ్ అనుభవం

ఇందులో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది నిర్మలమ్మ. సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ ని అయిన తాను ఒక సీన్‌ విషయంలో చాలా ఇబ్బంది పడిందట. ఒక్క అక్షరం కోసం 15 టేకులు తీసుకుందట.

తన లైఫ్‌లో అన్ని టేకులు తీసుకున్న ఏకైక సినిమా అదే అని చెప్పింది నిర్మలమ్మ. మోహన్‌ బాబు హీరోగా రూపొందిన చిత్రం `రాయుడు`. రవిరాజా పినిశెట్టి దర్శకుడు.

ఈ మూవీలో పాట షూటింగ్‌ సమయంలో నిర్మలమ్మ పలు మీడియా ఛానెల్స్ తో ముచ్చటించింది. ఇందులో ఈ విషయాన్ని పంచుకుంది.

ఆయన(మోహన్‌ బాబుని ఉద్దేశించి అని తెలుస్తోంది) సీన్ల విషయంలో ఎంత కచ్చితంగా ఉంటారో నిర్మలమ్మ చెప్పారు. `అతను ఎంత మొండివాడు, అతను కోరుకున్నది వచ్చేదాక టేక్‌ ఓకే చెప్పరు అని అంతా అంటుంటారు.

అది నిజమే. ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చి 42 ఏళ్లు అయ్యింది. సరిగ్గా గుర్తు లేదుగానీ దాదాపు ఎనిమిది వందల సినిమాల్లో నటించి ఉంటాను. డైలాగ్‌ నాకు భయపడేది. స్టేజీకి నేను చేసిన ప్రాక్టీస్‌ అలాంటిది.

ఒక్క అక్షరం కోసం 15 టేకులు: ఆమె అనుభవం

అలాంటి నేను ఒక రోజు ఒక చిన్న అక్షరంలో తేడా వచ్చి 15 టేకులు తీసుకున్నాను. అందుకు చాలా ఇన్‌సల్ట్ గా ఫీలయ్యాను. రాత్రి 11 గంటలకు అది జరిగింది.

అయినప్పటికీ తెల్లారి చెప్పించిన కూడా చెప్పగలగిన సామర్థ్యం నాకు ఉండింది. నేను ఏదైనా పేరు తెచ్చుకున్నానంటే అది డైలాగ్సే గానీ, మరోటి కాదు. అంతకంటే నా గొప్పతనం ఏం లేదు.

అలాంటి నేను ఒక్క అక్షరమే తేడా, ఆ తర్వాత డబ్బింగ్‌లో చాలా తేలికగా చెబుతున్నప్పుడు, ఇదేంటిది ఆ రోజు ఎందుకిలా నిలబెట్టాడు నన్ను` అని ఆశ్చర్యపోయిందట నిర్మలమ్మ.

తనజీవితంలో అత్యంత కష్టపడ్డ సీన్‌ అదే అని తెలిపింది. అయితే అది `రాయుడు` సినిమాలోని సీనేనా అనేది క్లారిటీ లేదు. నిర్మలమ్మ అందరు హీరోలతో కలిసి నటించినా చిరంజీవితో కాంబినేషన్‌ మాత్రం బాగా పండింది. నిజమైన బామ్మ మనవడిలా మెప్పించడం విశేషం.

నిర్మలమ్మ డైలాగ్ డెలివరీ పట్ల ఉన్న అంకితభావం, పట్టుదల ఈ సంఘటన నుండి స్పష్టంగా తెలుస్తుంది. ఆమె తెలుగు సినిమాకు చేసిన విశేషమైన సేవను మనం ఎప్పటికీ మరచిపోలేము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.