|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Siva Karthikeyan: అనవసరంగా ఆవేశ పడొద్దు.. ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేసిన హీరో శివ కార్తికేయన్

Published: 27-08-2025, 2:09 PM
Siva Karthikeyan: అనవసరంగా ఆవేశ పడొద్దు.. ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేసిన హీరో శివ కార్తికేయన్

హీరో శివ కార్తికేయన్ నటించిన ‘మదరాసి’ సినిమా ట్రైలర్ విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులతో ముఖ్యమైన విషయం పంచుకున్నారు.

Key Points

1

శివ కార్తికేయన్ త్వరలో విడుదల కాబోతున్న 'మదరాసి' సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

2

'నెక్స్ట్ దళపతి' అనే ట్యాగ్‌పై శివ కార్తికేయన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

4

శివ కార్తికేయన్ సినీ రంగంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజ్ఞప్తి చేశాడు.

‘మదరాసి’ ట్రైలర్‌కు అద్భుత స్పందన

హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) త్వరలో ‘మదరాసి’ (Madharasi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా.. ఇందులో రుక్మిణి వసంత్ (Rukmini Vasant) హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ (Trailer) రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ (Super response) వచ్చింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తనకు వచ్చిన ‘నెక్ట్స్ దళపతి, కుట్టి దళపతి’ అనే ట్యాగ్స్‌పై స్పిందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘ఇలా నన్ను పిలుస్తున్న మీ అభిమానికి, ప్రేమకు ధన్యవాదాలు. కానీ అన్న (విజయ్ దళపతి) ఎప్పుడూ అన్నే. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే’ అని తెలిపారు. అలాగే తనపై వచ్చే ట్రోల్స్‌(Trolls)పై మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాను అది చాలు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ అంటారా.. అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని పట్టించుకుని అనవసరంగా మీరు ఆవేశ పడొద్దు’ అంటూ ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేశాడు శివ కార్తికేయన్.

‘నెక్స్ట్ దళపతి’పై శివ కార్తికేయన్ వ్యాఖ్యలు

సోషల్ మీడియా ట్రోల్స్‌పై హీరో సలహా

చివరగా, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోకూడదని, అనవసరంగా ఆవేశపడొద్దని శివ కార్తికేయన్ తన అభిమానులను కోరాడు. సినిమా పట్ల అభిమానం చాలు అని అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.