|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sivakarthikeyan-Rashmika: రశ్మిక బ్యాడ్ లక్.. ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి తీసేశారు.. మరి ఎవరు చేస్తున్నారో తెలుసా..

Published: 13-11-2025, 10:42 PM
Sivakarthikeyan-Rashmika: రశ్మిక బ్యాడ్ లక్.. ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి తీసేశారు.. మరి ఎవరు చేస్తున్నారో తెలుసా..

శివకార్తికేయన్ తదుపరి సినిమాలో జరగబోయే హీరోయిన్ మార్పు హాట్ టాపిక్‌గా మారింది. ‘డాన్’ కాంబో రిపీట్ కానున్న కొత్త ప్రాజెక్ట్‌లో రశ్మిక మందన్న స్థానంలో శ్రీలీల ఎంపికైనట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Key Points

1

శివకార్తికేయన్ "మదరాశి" ప్లాప్ తర్వాత హిట్ కోసం ఎదురుచూపులు.

2

సుధా కొంగర దర్శకత్వంలో "పరాశక్తి"లో శ్రీలీల హీరోయిన్.

4

శివకార్తికేయన్, శ్రీలీల జంటగా రానున్న మరో కాలేజ్ బ్యాక్‌డ్రాప్ ఎంటర్‌టైనర్.

శివకార్తికేయన్ కెరీర్, రాబోయే సినిమాలు

Sivakarthikeyan-Rashmika: తమిళ స్టార్ శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఈ హీరోకి తమిళ్ లో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అదే రేంజ్ లో మార్కెట్ ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మంచి అంచనాలు క్రియేట్ అవుతాయి.(Sivakarthikeyan-Rashmika) కెరీర్ బిగినింగ్ లో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ నటుడు ఈ మధ్య కాస్త వెనుకబడిపోయాడు. రీసెంట్ గా శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన సినిమా మదరాశి. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో, తన నెక్స్ట్ సినిమాలతో అయినా ఖచ్చితంగా హిట్ సాధించాలని ఫిక్స్ అయ్యాడు ఈ హీరో.

Allu Arjun-Atlee: జెట్ స్పీడ్ లో ఫినిష్.. అట్లీ పక్కా ప్లాన్.. అనుకున్నదానికన్నా ముందుగానే..

రశ్మిక స్థానంలో శ్రీలీల ఎంపిక! (‘డాన్’ కాంబో రిపీట్)

ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ హీరో లేడీ డైరెక్టర్ సుధా కొంగరాతో “పరాశక్తి” అనే సినిమాను చేస్తున్నాడు. పీరియాడిక్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా కోసం మొదటిసారి జత కట్టిన శివ కార్తికేయన్-శ్రీలీల ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమా చేయనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేటంటే, శివ కార్తికేయన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్టులో ఉండే సినిమా డాన్. సీబీ చక్రవర్తి తెరకెక్కించిన ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.

శివకార్తికేయన్ – శ్రీలీల మళ్ళీ జతగా

ఇప్పుడు ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందట. మరోసారి కాలేజ్ బ్యాక్డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుందట. అయితే, ఈ సినిమాలో ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని చూశారట మేకర్స్. కానీ, అనుకోని కారణాల వల్ల రశ్మికను తప్పించి ఆమె ప్లేస్ లో శ్రీలీలను ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మొత్తానికి, రశ్మిక బ్యాడ్ లక్‌తో శివకార్తికేయన్‌తో చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ చేజారిపోయింది. శ్రీలీల వరుసగా రెండు చిత్రాలలో ఆయనతో జతకట్టడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.