
📌 Key Points
- 2026 సంక్రాంతికి విజయ్ ‘జన నాయగన్’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ క్లాష్
- విజయ్ సినిమా తేదీ తెలిసి షాక్‌కు గురయ్యానని శివ కార్తికేయన్ వెల్లడి
- రిలీజ్ డేట్ మార్పుపై విజయ్‌కు కాల్ చేసి చర్చించిన శివ కార్తికేయన్
- నిర్మాతలు అంగీకరించకపోవడంతో సంక్రాంతి విడుదల ఖాయం
2026 సంక్రాంతికి స్టార్ హీరోలు విజయ్, శివ కార్తికేయన్ సినిమాలు ఢీకొట్టబోతున్నాయి. విజయ్ ‘జన నాయగన్’ విడుదల తేదీ తెలిసి శివ కార్తికేయన్ షాక్ అయ్యారు. రిలీజ్ డేట్ మార్పుపై విజయ్‌కు కాల్ చేసి చర్చించారు. ఈ క్లాష్‌పై శివ కార్తికేయన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సంక్రాంతి రేసులో విజయ్ – శివ కార్తికేయన్
విజయ్ ‘జన నాయగన్’ సినిమాతో తన ‘పరాశక్తి’ మూవీ పోటీ పడటంపై శివకార్తికేయన్ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో స్పందించారు. ఈ విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. రిలీజ్ డేట్ గురించి విజయ్ కు కాల్ కూడా చేశానన్నారు. ఈ రెండు సినిమాలు 2026 సంక్రాంతి రేసులోకి వస్తున్నాయి.
2026 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రెండు తమిళ సినిమాలు ఢీ కొడుతున్నాయి. స్టార్ హీరో విజయ్ మూవీ ‘జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు)’, శివ కార్తికేయన్ చిత్రం ‘పరాశక్తి’ బాక్సాఫీస్ పోరుకు సై అంటున్నాయి. జనవరి 9న జన నాయగన్, జనవరి 10న పరాశక్తి రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో జన నాయగన్ రిలీజ్ డేట్ పై శివ కార్తికేయన్ షాకింగ్ రియాక్షన్ వైరల్ గా మారింది.
రిలీజ్ తేదీపై శివ కార్తికేయన్ షాకింగ్ రియాక్షన్
పరాశక్తి వర్సెస్ జన నాయగన్
శివ కార్తికేయన్ కామెంట్లు
విజయ్‌కు కాల్ చేసిన శివ కార్తికేయన్.. ఏమడిగారు?
“జన నాయగన్ రిలీజ్ డేట్ తెలిసి నేను షాక్ అయ్యా. మనం తేదీని మార్చుకోవచ్చా అని మా నిర్మాతకు కాల్ చేసి అడిగాను. అయితే ఇన్వెస్టర్లందరికీ మా పొంగల్ విడుదల గురించి ఇప్పటికే చెప్పేశారు. ఇక 2026 వేసవిలో రిలీజ్ చేద్దామంటే అప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా అది కష్టమవుతుందని ప్రొడ్యూసర్ చెప్పారు” అని శి కార్తికేయన్ అన్నారు.
పొంగల్ కాబట్టి ప్రాబ్లం లేదని
మొత్తానికి, 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద తమిళ సినిమాలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ ‘జన నాయగన్’ వర్సెస్ శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ మధ్య ఈ పోరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్లాష్ ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.


